Fighting in wedding : పెళ్లిలో భోజనం ఆలస్యం...రెచ్చిపోయిన బంధువులు

ఉత్తరప్రదేశ్‌  రాష్ట్రంలోని గోవర్థన్‌పూర్‌ గ్రామంలో సబీర్ అనే వ్యక్తి తన కూతురు పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. పెళ్లి భోజనం ఆలస్యమైందని వరుడి తరఫున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చిన్న గొడవగా మొదలై బంధువుల మధ్య పెద్ద ఘర్షణ గా మారింది.

New Update
 marriage

marriage

Fighting in wedding : పెళ్లిళ్ల సమయంలో చిన్న చిన్న విషయాలే పెద్ద ఘర్షణకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా ఆడపెళ్లివారు మగపెళ్లివారికి మర్యాద చేయలేదని, భోజనం సరిగా పెట్టలేదని, మాంసం వడ్డించలేదని ఇలాంటి చిన్న చిన్న విషయాలకే గొడవకు దిగుతారు. అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: Krishna Water Dispute: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల లొల్లి.. అసలేంటి వివాదం ?

ఉత్తరప్రదేశ్‌  రాష్ట్రంలోని గోవర్థన్‌పూర్‌ గ్రామంలో సబీర్ అనే వ్యక్తి తన కూతురు పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. వరుడు, వధువు బంధువులు పెళ్లి వేడుకను వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి వరకు భాగనే ఉన్నా  పెళ్లి భోజనం ఆలస్యమైందని వరుడి తరఫున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ...  70శాతం సక్సెస్ రేటు!

అప్పటికి వధువు ఇంటివారు వివాహ విందుకు ఘనంగానే ఏర్పాట్లు చేశారు. పెళ్లికి వచ్చిన వారికి ఏ మాత్రం తగ్గకుండా భోజనాలు వడ్డించేలా అన్నిరకాల పదార్థాలు రెడీ చేశారు. మందు, విందు ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. ఇంతలో వరుడి తరుపు బంధువులు కొందరు యువకులు తమకు వెంటనే భోజనం వడ్డించాలంటూ అమ్మాయి తరుపు వారిని కోరారు. అయితే వివాహ పనుల్లో ఉన్నా వధువు ఇంటివారు కొంత ఆలస్యం చేశారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకి నచ్చజెప్పేందుకు సబీర్‌ ప్రయత్నించాడు. కానీ వారు వినకపోగా.. గొడవ చేశారు. ఈ క్రమంలో చిన్న గొడవగా మొదలై వరుడు, వధువు తరపున బంధువుల మధ్య పెద్ద ఘర్షణ గా మారింది. అంతే పెళ్లి విషయం పక్కన పెట్టి రెండు కుటుంబాలు ఫైటింగ్ కు దిగాయి.

ఇది కూడా చదవండి: Kurnool Road Accident: APలో ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా నుంచి వస్తుండగా బస్సు బోల్తా: 45 మంది ప్రయాణికులు!

 ఒకరినొకరు కొట్టుకోవడంతో కూర్చీలు విసురుకోవడం, కనిపించిన వస్తువులన్నింటిని విసరడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారందరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: TTD: తప్పు చేశా క్షమించండి.. దిగొచ్చిన టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mamata Benarjee: మీరు ఉద్యోగాలకు వెళ్లండి.. నాదీ గ్యారెంటీ : దీదీ

పశ్చిమ బెంగాల్‌లో 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మరోసారి స్పందించిన మమతా బెనర్జీ వాళ్ల ఉద్యోగాలకు గ్యారంటీ ఇస్తున్నాని తెలిపారు. తిరిగి విధుల్లో చేరాలని కోరారు.

New Update
Mamata Benarjee

Mamata Benarjee

పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి విధులు నిర్వహిస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఏప్రిల్ మొదటి వారంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకి భరోసా ఇచ్చారు. దీనిపై నిరసన చేపట్టిన టీచర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మిడ్నాపోర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.  

Also Read: 9 మంది భార్యలు వదిలేస్తే, పదో భార్యను భర్తే చంపేశాడు.. ఎందుకంటే?

'' ఈ అంశంలో ఎవరు నిజాయితీపరులు ? ఎవరు కాదు అనేదానిపై ఆందోళన చెందవద్దు. జాబ్ ఉందా.. శాలరీ సరైన టైమ్‌కు వస్తుందా ? లేదా? అనే దాని గురించే ఆలోచించండి. టీచర్ల నియామకాల్లో పారదర్శకతకు సంబంధించిన లిస్ట్‌ను ప్రభుత్వం, కోర్టులు పరిశీలిస్తాయి. మీ ఉద్యోగాలకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. తిరిగి పాఠశాలలకు వెళ్లి మీ విధులు నిర్వర్తించండి. మీతో నేను ఉన్నాను. 

ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ల తరఫున రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తాం. అప్పటివరకు మా ప్రభుత్వంపై నమ్మకం ఉంచడని'' మమత బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా.. పశ్చిమ బెంగాల్‌లో 2016కు సంబంధించి టీచర్‌ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వీటిని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. 2024లో కోల్‌కత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.  

Also Read: జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !

మొత్తం 25,753 మంది ఉపాధ్యాయుల, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికీ ఈ టీచర్ నియామకాలు చెల్లవని తీర్పునిచ్చింది. దీనిపై మళ్లీ నియామకాలు చేపట్టాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.  

 telugu-news | rtv-news | mamata-benarjee | national-news

Advertisment
Advertisment
Advertisment