/rtv/media/media_files/2026/02/05/fotojet-21-2026-02-05-18-29-17.jpg)
Meghalaya Coal Mine
Meghalaya Coal Mine : బొగ్గు గనుల్లో భారీ పేలుడు సంభవించి10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన మేఘాలయలో చోటుచేసుకుంది. గని లోపల ఈ ఘటన జరగడం వల్ల . భారీగా ప్రాణనష్టం సంభవించింది. మృతుల్లో ఎక్కువ మంది అసోంకి చెందినవారేనని తెలుస్తోంది. అక్రమ మైనింగ్, భద్రత పరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. ఈ ఘటన గనుల్లో పనిచేసే కార్మికుల భద్రతపై మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. దాంతో కూలీలు అందులో చిక్కుకుపోయారు. వారిలో ఎక్కువమంది అస్సాంకు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.
మేఘాలయలో ర్యాట్‌హోల్ మైనింగ్, అశాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలను 2014లోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) నిషేధించింది. సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్ హోల్ మైనింగ్‌గా (Rat Hole mining) వ్యవహరిస్తారు. ఇలా నేలలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్ హోల్‌గా పేర్కొంటారు. సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉంటుంది. కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలడు. కాగా.. ఎన్‌జీటీ నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
Follow Us