/rtv/media/media_files/2025/03/02/FzsnsaouW9UcQfBIeNof.jpg)
Farmers to get permanent power connection for 5 rupees, says Madhya Pradesh CM Mohan Yadav
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందిస్తామని చెప్పారు. భోపాల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మరికొన్ని రోజుల్లోనే ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతులకు ఈ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.
Also Read: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
రైతులకు మంచి చేయాలని, వాళ్ల జీవితాలు బాగుండాలనే తమ ప్రభుత్వం కోరుకుంటుందని తెలిపారు. అంతేకాదు నీటిపారుదల కోసం సోలార్ పైపుల ద్వారా రైతులకు విద్యుత్ సంబంధిత ఇబ్బందులు లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాబోయే మూడేళ్లలో 30 లక్షల సోలార్ ఇరిగేషన్ పంపుల్ని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
Also Read: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
అంతేకాదు ప్రభుత్వం రైతుల నుంచి సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవని విమర్శించారు. విద్యుత్తు, రోడ్లు లేకపోడవంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులన్ని మారిపోయాయని తెలిపారు.
Also read : మేడిగడ్డలో లోపాలు.. ఆ బ్లాక్ మళ్లీ నిర్మించాల్సిందే .. ఎన్డీఎస్‌ఏ సంచలన రిపోర్ట్
Also read : పిల్లలమ్మ, పిల్లలూ.. నార్త్ ఇండియన్ పిల్లలు.. ఏపీలో బలగం సరోజిని దందా గుట్టురట్టు