/rtv/media/media_files/2026/03/12/indian-ships-in-strait-of-hormuz-2026-03-12-11-43-30.jpg)
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో భారత్ మరోసారి తన దౌత్య చతురతను చాటుకుంది. ఇరాన్ తీరంలోని కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడింది.
BREAKING || Big Diplomatic Win For India
— TIMES NOW (@TimesNow) March 12, 2026
After External Affairs Minister S. Jaishankar spoke with his Iranian counterpart Araghchi, safe passage has been given for Indian tankers via Hormuz.
- Safe passage for two Indian tankers, Pushpak and Parimal @amitk_journo shares… pic.twitter.com/TCJcyovaRV
అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడుల చేస్తోంది. ముడి చమురు సప్లైని అడ్డుకొని ఆయా దేశాలను ఎండగడుతుంది. భారత జెండా కలిగిన ట్యాంకర్లకు ఇరాన్ రక్షణ కల్పించడం విశేషం. ఒప్పందం కుదిరిన కొద్దిసేపటికే, "పుష్పక్", "పరిమల్" అనే రెండు భారతీయ చమురు ట్యాంకర్లు ఎటువంటి ఆటంకం లేకుండా హార్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా ప్రయాణించాయి.
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వ్యూహాత్మక అస్త్రం
ప్రపంచ ఇంధన సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైనది. అమెరికా, దాని మిత్రదేశాలను ఉద్దేశించి ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. "తమ శత్రువులకు ఒక్క లీటరు చమురును కూడా ఈ జలసంధి గుండా వెళ్లనివ్వబోమని" ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ ప్రాంతాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా మలచుకున్న ఇరాన్, ప్రపంచ ఇంధన వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకుంది.
జైశంకర్ 'దౌత్య' మంత్రం
యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో కూడా ఇరాన్‌తో చర్చలు జరిపి, భారత ప్రయోజనాలను కాపాడటంలో జైశంకర్ విజయం సాధించారు. భారత్ అనుసరిస్తున్న తటస్థ విదేశీ విధానం, ఇరాన్‌తో ఉన్న చారిత్రక సంబంధాలు ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు రక్షణ కవచంగా నిలిచాయి. అగ్రరాజ్యాల నౌకలే ఇక్కడ దాడులకు గురవుతుంటే, భారత నౌకలు సురక్షితంగా వెళ్లడం అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాముఖ్యతను చాటిచెబుతోంది. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరల స్థిరత్వానికి, సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఉండటానికి గొప్ప ఉపశమనం లభించింది.
Follow Us