Diwali Holidays: గుడ్‌న్యూస్.. దీపావళి పండగకు 6 రోజులు సెలవులు

జమ్మూ కాశ్మీర్‌లో కొత్తగా ఏర్పడిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా 5రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు సెలవులు లభించనున్నాయి. అయితే నవంబర్ 3 ఆదివారం కావడంతో మొత్తం 6 రోజుల సెలవులు దొరకనున్నాయి.

New Update
school holydays,

మొన్నటికి మొన్ననే దసరా పండుగ సందర్భంగా స్కూల్స్‌, కాలేజీలకు భారీగా సెలవులు వచ్చాయి. స్కూళ్లకు అయితే దాదాపు 10 రోజులు సెలవులు లభించాయి. దీంతో విద్యార్థులంతా హ్యాపీగా దసరా పండుగ చేసుకున్నారు. ఆ సెలవులు పూర్తయ్యాయి అనేలోపు భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు పాఠశాలలకు మరో రెండు మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఇలా వరుస సెలవులతో విద్యార్థులు ఫుల్ ఖుష్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: పట్టపగలే ఇద్దరు చిన్నారుల కిడ్నాప్.. తండ్రే కారణం..!

దీపావళి పండుగ సందర్భంగా

అయితే ఇప్పుడు దీపావళి పండుగ మొదలైంది. దీంతో మరిన్ని రోజులు సెలవులు లభించనున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి సందర్భంగా ఏకంగా 6 రోజులు సెలవులు ప్రకటించింది. అందులో ప్రభుత్వం 5 రోజులు సెలవులు అందిస్తుండగా.. 1 రోజు ఆదివారం కలిసొచ్చింది. ఈ సెలవులు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు అంటే శనివారం వరకు ఉండగా.. నవంబర్ 3 ఆదివారం కావడంతో మొత్తం 6 రోజులు సెలవులు వచ్చాయి.

ఇది కూడా చదవండి: టూత్ పేస్ట్ కొంటే ఉద్యోగం ఊస్ట్.. ఎంప్లాయీస్ కు మెటా ఊహించని షాక్!

అయితే ఈ సెలవులు మరెక్కడో కాదు.. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన జమ్మూ కాశ్మీర్‌లో. ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా సర్కార్.. దీపావళి సందర్భంగా 5 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఆ తర్వాత రోజు ఆదివారం కావడంతో మొత్తం ఆరు రోజులు సెలవులు దొరకనున్నాయి.

ఇది కూడా చదవండి: భారత్‌కు ఉగ్రవాది హెచ్చరిక.. రేపటి నుంచి!

ఈ విషయాన్ని తెలియజేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జమ్మూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. దీపావళి సందర్భంగా జమ్మూలో అక్టోబర్ 29 నుండి  నవంబర్ 2 వరకు స్కూల్స్ మూసివేయనున్నట్లు తెలిపింది. హయ్యర్ సెకండరీ స్థాయి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

నవంబర్ 3 ఆదివారం కావడంతో తిరిగి 4వ తేదీన విద్యాసంస్థలు ఓపెన్ చేయనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు దీపావళి సెలవులు ప్రకటించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు