హాస్పిటల్లో సోనియా గాంధీ.. ఆమెకు ఏమైందంటే?

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ హెల్త్ బులిటెన్ డాక్టర్లు విడుదల చేశారు. మంగళవారం రాత్రి ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు వెల్లడించారు.

New Update
_Sonia Gandhi

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హెల్త్ బులిటెన్ డాక్టర్లు విడుదల చేశారు. మంగళవారం రాత్రి ఆమెను ఢిల్లీలోని ప్రముఖ సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా గాంధీ మంగళవారం రాత్రి 10:22 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. సర్ గంగా రామ్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, సోనియా గాంధీ ప్రస్తుతం నిలకడగా ఉన్నారని, ఎక్స్‌పర్ట్ డాక్టర్ల టీం ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు.

సోనియా గాంధీకి ప్రాథమికంగా కడుపు, మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. దీనిని నిర్ధారించుకోవడానికి ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చికిత్సలో భాగంగా ఆమెకు యాంటీబయాటిక్స్ అందిస్తున్నామని, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కొనసాగుతోందని డాక్టర్లు పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా లేదని, కేవలం అబ్జర్వేషన్ కోసం మాత్రమే ఆమెను ఆస్పత్రిలో ఉంచినట్లు స్పష్టం చేశారు.

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల సోనియా గాంధీ ఆరోగ్యానికి కొంత ఆటంకం కలిగి ఉండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల ప్రభావం ఆమెపై పడి ఉంటుందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్లు ఆమెకు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఆమె కడుపు, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. వైద్యులు ఆమె ఆరోగ్య పురోగతిని బట్టి త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు