/rtv/media/media_files/2026/05/06/dmk-aiadmk-alliance-on-the-card-to-form-govt-2026-05-06-21-28-43.jpg)
DMK-AIADMK Alliance On The Card to form govt
తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే చీఫ్ విజయ్‌కు షాకిచ్చేలా రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేసినా మెజార్టీ బలం రాలేదు. ఈ క్రమంలోనే DMK-AIADMK పార్టీలు పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో DMKకు 59, AIADMKకు 47 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలు కలిపితే మొత్తం 106 స్థానాలు వస్తాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మరో 12 మంది ఎమ్మెల్యేల బలం అవసరం అవుతుంది.
లెఫ్ట్, IUML, PMK, VCK లాంటి చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. అందుకే ఈ చిన్న పార్టీలు టీవీకేకు మద్దతు ఇవ్వడం లేదని ప్రచారం నడుస్తోంది. ఒకవేళ డీఎంకే, ఏఐడీఎంకే కూటములు పొత్తు పెట్టుకుంటే తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ సంఖ్య 118. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ నుంచి అయిదురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు పలికారు. విజయ్ రెండు స్థానాల్లో గెలవడంతో ఓ స్థానానికి మినహాయింపు ఉంటుంది. దీంతో మొత్తం టీవీకే బలం 112కు చేరింది.
కానీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ కావాల్సి ఉంటుంది. TVKకు సపోర్ట్ ఇవ్వమని లెఫ్ట్ పార్టీలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) తేల్చిచెప్పాయి. డీఎంకే మిత్రపక్షమైన మరో పార్టీ వీసీకే.. టీవీకేకు సపోర్ట్ ఇచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో టీవీకేకు మద్దతిచ్చే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది ఆసక్తిగా మారింది. మరోవైపు AIADMK పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడుతుందా ? లేదా DMK--AIADMK పొత్తు పెట్టుకోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Follow Us