/rtv/media/media_files/2026/06/09/dk-shivakumar-2026-06-09-15-03-08.jpg)
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆపిల్ పండ్లను కొరికి జనంపైకి విసిరిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరు దీనిని అభిమానంతో చేసిన పని అంటుంటే, మరికొందరు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వైరల్ వీడియో క్లిప్ డీకే శివకుమార్ కనకపురలోని హారహల్లి ప్రాంతంలో పర్యటించినప్పుడు రికార్డ్ అయింది. ఆయన అక్కడకు వచ్చినప్పుడు స్థానిక మద్దతుదారులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానికులు ఆయనకు తాజా ఆపిల్ పండ్లు, పూలతో చేసిన ఒక భారీ గజమాలను బహుకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అయితే ఆ సమయంలో డీకే శివకుమార్ ఆ భారీ దండలోంచి ఒక ఆపిల్ పండును నోటితో కొరికారు. అలా కొరికిన పండును అక్కడ చేరిన కార్యకర్తల వైపునకు విసిరారు. ఆయన అలా ఎంగిలి చేసిన ఆపిల్‌ను విసరగానే గాల్లోకి లేచిన ఆ పండును పట్టుకోవడానికి చాలా మంది పోటీ పడ్డారు. అయితే ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. డీకే శివకుమార్ తనను తాను ఒక దేవుడిగా ఊహించుకుంటున్నారా అని ఒకరు ప్రశ్నించారు. దేవుడి ప్రసాదం లాగా ఆపిల్ దండలోని పండును కొరికి జనంపైకి విసరడం ఏంటని మండిపడ్డారు.
విమర్శలకు దారి తీస్తున్న కర్ణాటక కాంగ్రెస్ సీఎం డీకే శివకుమార్ చర్యలు
— Mirror TV (@MirrorTvTelugu) June 9, 2026
కనకపుర పర్యటనలో భాగంగా సగం యాపిల్ కొరికి కార్యకర్తల మీదికి విసిరేసిన డీకే శివకుమార్
రాచరికపు పోకడలు అంటూ ప్రజల విమర్శలు https://t.co/gdKhQfasbVpic.twitter.com/PkFdbvjYEv
పాతకాలపు రాచరికపు పోకడ
ఇది నాయకత్వం అనిపించుకోదని, ప్రజలను పెంపుడు జంతువుల్లా చూసే పాతకాలపు రాచరికపు పోకడ అని కొందరు తీవ్రంగా విమర్శించారు. సగం కొరికిన ఆపిల్‌ను జనం వైపు విసిరి, వారు దాని కోసం ఎగబడటం చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని, ఇది ప్రజలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటి బ్యాక్టీరియాను అందరికీ అంటిస్తున్న ఇలాంటి ప్రజాకర్షక నాయకులకు ప్రజలు ఎందుకు ఓటు వేస్తున్నారో అర్థం కావడం లేదంటూ మరికొందరు నెటిజన్లు ఘాటుగా స్పందించారు.
Follow Us