Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళికి స్పెషల్ 804 రైళ్లు దీపావళి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 804 ప్రత్యేక రైళ్లను నడపనుంది. రిజర్వేషన్ చేసుకోని వారికి యూటీఎస్ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. By Kusuma 23 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి దీపావళి పండుగకి గ్రామాలకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. పండుగ నేపథ్యంలో 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చేసుకోకుండా ప్రయాణించే వారికి యూటీఎస్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చేసుకోని ప్రయాణికులు తప్పకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది. ఇది కూడా చూడండి: ఐదేళ్లుగా నకిలీ కోర్టు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే? గత సీజన్‌తో పోలిస్తే.. గత సీజన్‌లో 626 ప్రత్యేక రైళ్లను నడిపారు. కానీ ఈ సీజన్‌లో 178 సర్వీసులను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీరిని దృష్టిలో ఉంచుకుని దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది కూడా చూడండి: కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి షాలిమార్, రాక్సల్, జయపుర, హిస్సార్, గోరఖ్‌పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చిలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మదురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వెల్, దాదర్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇది కూడా చూడండి: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. నెట్టింట దుమ్ము లేపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ పండుగల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ప్రత్యేక రైళ్లలో రిజర్వ్‌డ్ కోచ్‌లు, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు కూడా ఉన్నాయని తెలిపింది. ఇదిలా ఉండగా.. దానా తుపాను వల్ల దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. దాదాపుగా 200 రైళ్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు గోవిందా! #south-central-railways #diwali #train-passengers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి