Maha Kumbh: మహా కుంభ మేళాలో డిజిటల్ బాబాగా ప్రసిద్ది చెందిన స్వామి రామ్ శంకర్ మహారాజ్, ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో కలిపి వివరిస్తున్నారు. సాధారణంగా ఉండే బాబాలలాగా కాకుండా ఆయన వెరైటీగా చేతిలో Apple iPhone 16 Max Pro, Apple 2024 MacBook Pro M4 Max, ట్రైపాడ్,రోడ్ వైర్లెస్ మైక్రోఫోన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆయన ఫేమస్ అవ్వడమే కాకుండా.. 336k ఫేస్‌బుక్ ఫాలోవర్లు, 29.6k యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లతో మహా కుంభ మేళాలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు.
Also Read: KTR : నేడు ఈడీ విచారణకు కేటీఆర్.. అరెస్ట్ తప్పదా!
స్వామి రామ్ శంకర్ మహారాజ్ డిజిటల్ బాబా అవతారంమే ఆయన్ని ఇతర సన్యాసుల నుంచి వేరుచేసే ముఖ్యమైన అంశం. ఆయన ఆధ్యాత్మిక సందేశాలను పాఠశాలలో కూర్చొని ప్రసంగించడం కాకుండా, డిజిటల్ యుగానికి తగినట్లుగా ఆధ్యాత్మికతను ప్రజలకు బోధిస్తుంటారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “నేను ఒకే చోట కూర్చొని ప్రసంగించడాన్ని నమ్మలేదు. ఇది డిజిటల్ యుగం. అందుకే మనం డిజిటల్ మార్గంలో ఆధ్యాత్మికతను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలి. అదే కారణం, నేను నా యువ అనుచరులకు మహా కుంభను మొబైల్స్ లో చిత్రీకరించి, సంస్కృత ధర్మంలోని శక్తిని వారితో పంచుకుంటున్నాను. దీని ద్వారా ప్రపంచం సంస్కృత ధర్మం గొప్పతనాన్ని అవగాహన చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను.”
Also Read: సొంత ఇల్లు, కారు లేవట.. అఫిడవిట్‌లో కేజ్రీవాల్ ఆస్తులు ఇవే!
సోషల్ మీడియా శక్తి..
స్వామి రామ్ శంకర్ మహారాజ్ డిజిటల్ ప్రపంచంలోకి 2019లో అడుగుపెట్టారు. అప్పుడే ఆయన మొట్టమొదటి iPhone కొనుగోలు చేశారు. 2008 నుండి సన్యాసి అయిన ఆయన.. ఇండియాలోని గురుకులాలలో తన చదువులు పూర్తిచేసిన తర్వాత Facebook అకౌంట్ క్రియేట్ చేసారు. సోషల్ మీడియా శక్తిని గుర్తించిన ఆయన, లక్షల మందితో సంబంధం పెంచుకునేందుకు వీడియోలను రూపొందించడం మొదలు పెట్టారు. “సోషల్ మీడియా, యువతతో కనెక్ట్ కావడానికి కొత్త మార్గం అని నేను గుర్తించాను. అందుకే నేను డిజిటల్ బాబా అయిపోయాను” అని ఆయన వివరించారు.
Also Read: వావ్.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ టిక్కెట్లు.. మరీ ఇంత చీపా!
Also Read: USA: ఆ లోపు వచ్చేయండి.. హెచ్1–బి వీసాదారులకు కంపెనీల సూచన