Dhanteras ధమాకా.. వేల కోట్లలో అమ్ముడైన బంగారం, వెండి.. ఎంతంటే?

ధన్‌తేరస్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు రూ.20,000 కోట్ల విలువైన బంగారం, రూ.2,500 కోట్ల విలువైన వెండి అమ్ముడు పోయిందని CAIT ప్రధాన కార్యదర్శి చాందినీ చౌక్‌కి చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు.

author-image
By Seetha Ram
New Update
gold,

దీపావళికి ముందు త్రయోదశి ధంతేరాస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ హిందువులకు చాలా ప్రత్యేకం. ఈ పండుగ రోజు కోటీశ్వరుల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ బంగారం, వెండి పాత్రలతోపాటు నూతన వస్త్రాలు, ఇల్లు, ఆస్తి మొదలైనవి ఎక్కువగా కొనుక్కుంటారు. వీటితో పాటు లక్ష్మీ దేవి ప్రతిమను కొనుక్కోవడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని.. ఇంటిల్లి పాది సుఖ సంతోషాలతో ఉంటుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్

అయితే ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ 29న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్ల విలువైన బంగారం, వెండి సేల్ అయింది. ధన్‌తేరస్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు రూ.20,000 కోట్ల విలువైన బంగారం, రూ.2,500 కోట్ల విలువైన వెండి అమ్ముడు పోయిందని CAIT ప్రధాన కార్యదర్శి, చాందినీ చౌక్‌కి చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు.

ఇది కూడా చూడండి: 'రచ్చ గెలిచి ఇంట గెలిచాను'.. ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు వేడుకల్లో చిరంజీవి

కాగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 25 టన్నుల బంగారం అమ్ముడు కాగా.. దీని విలువ సుమారు రూ.20,000 కోట్లుగా ఉంది. అదే సమయంలో సుమారుగా 250 టన్నుల వెండి రూ.2,500 కోట్లకు విక్రయించబడింది. అదనంగా పాత వెండి నాణేలకు డిమాండ్ పెరిగింది. ఒక్కో నాణెం రూ.1,200 నుంచి రూ.1,300 మధ్య ఉంటుంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారం ధన్‌తేరస్‌పై సుమారు రూ.60,000 కోట్లుగా అంచనా వేయబడింది.

ఇది కూడా చూడండి:  Chiruచిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం

ఈ ప్రాంతాల్లో అధిక అమ్మకాలు

ఇది కూడా చూడండి: US Elections: అమెరికాలో ఆ పార్టీ ఓట్లు ట్రంప్‌ కే!

ఢిల్లీలో, చాందినీ చౌక్, దరిబా కలాన్, సదర్ బజార్, కమలా నగర్, అశోక్ విహార్, మోడల్ టౌన్, పితంపురా, పశ్చిమ్ విహార్, రోహిణి, రాజౌరీ గార్డెన్, ద్వారక, జనక్‌పురి, సౌత్ ఎక్స్‌టెన్షన్, గ్రేటర్ కైలాష్, గ్రీన్ పార్క్, లజ్‌పత్ నగర్, కల్కాజీ, ప్రీత్ విహార్, షాహదారా, లక్ష్మీ నగర్ వంటి ప్రముఖ రిటైల్ మార్కెట్‌లలో ధన్‌తేరస్ అమ్మకాలు పెరిగాయి.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు