కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ తొలగింపు..?

భారత రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

భారత రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వరుస ఎన్నికల పరాజయాల నేపథ్యంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని ఫడ్నవీస్ జోస్యం చెప్పారు.

ఉనికి కోసం రాహుల్ పోరాటం!

ఆదివారం నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫడ్నవీస్, మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "రాహుల్ గాంధీ ప్రస్తుతం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే కాకుండా, పార్టీలో తన పడిపోతున్న నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరుసగా ఎదురవుతున్న ఓటములు ఆయన అసమర్థతను చాటిచెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత మొదలైంది. త్వరలోనే ఆయనను పార్టీ నుంచి తప్పించే అవకాశం ఉంది" అని ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగంపై రాహుల్ ఆరోపణలకు కౌంటర్

అంతకుముందు రోజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. భారత్‌లో సమానత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీ, RSS రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాయంటూ రాహుల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై మండిపడ్డ సీఎం, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, కలహాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రాహుల్ ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని కొట్టిపారేశారు.

"రాహుల్ గాంధీకి విజయాలు అందించడం చేతకాదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగం ప్రమాదంలో ఉందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పార్టీని గెలిపించలేని నాయకుడిని ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం భరించలేదు. కాంగ్రెస్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది" అని ఫడ్నవీస్ విశ్లేషించారు.

వేడెక్కుతున్న రాజకీయాలు

వరుసగా జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, మరోవైపు బీజేపీ తన పట్టును బిగించుకోవడం చూస్తుంటే, ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ నేతలు చేస్తున్న ఈ దాడులు, రాబోయే ఎన్నికల ప్రచారంలో మరింత ముదిరే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఫడ్నవీస్ వ్యాఖ్యలను ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం మహారాష్ట్ర పాలిటిక్స్‌లో రాహుల్ వర్సెస్ ఫడ్నవీస్ వార్ పీక్స్‌కు చేరింది.

Advertisment
తాజా కథనాలు