Fire Accident: కదులుతున్న రైలులో భారీ మంటలు! మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి.రైలు ఇంజిన్ లో మంటలు రేగినప్పుడు దట్టంగా పొగ రావడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. By Bhavana 28 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి MP : మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు రైల్వే అధికారి ఒకరు విషయాన్ని స్వయంగా తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. Also Read: ఏపీలో ఆ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం! దట్టంగా పొగ రావడంతో.. రైలు ఇంజిన్ లో మంటలు రేగినప్పుడు దట్టంగా పొగ రావడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. డాక్టర్ అంబేద్కర్ నగర్ (మోవ్) నుంచి రత్లాంకు బయలుదేరిన డీఎంయూ రైలు ఇంజిన్‌లో ఆదివారం సాయంత్రం 5.30 గంటల టైమ్ లో రుణిజా – నౌగావ్ మధ్య మంటలు, పొగ వ్యాపించినట్లు పశ్చిమ రైల్వేలోని రత్లాం డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఖేమ్‌రాజ్ మీనా తెలిపారు. ప్యాసింజర్ రైలులో మంటలు అదుపులోకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని మీనా తెలిపారు. Also Read: హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు.. అతిక్రమిస్తే చర్యలు తప్పవు మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలిపారు. రైలు ప్రీతమ్ నగర్‌కు ఇంకా మూడు కిలోమీటర్ల ఉందనగానే, రైలు ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగ రావడం ప్రారంభం అయ్యింది. పొగలు రావడంతో రైలును దట్టమైన అడవిలోనే నిలిపివేశారు. రైలు ఆగిన తర్వాత ఇంజన్‌లో మంటలు వచ్చినట్లు సమాచారం వచ్చింది. సమాచారం అందిన వెంటనే ప్రయాణికులు కూడా రైలు నుంచి బయటకు వచ్చారు. Also Read: నేషనల్ హైవే పై ఘోర ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన లారీ! రైలు ఆగిన వెంటనే గ్రామస్థులు కూడా రైలు పరిసరాలకు వచ్చారు. దీని తరువాత సమీపంలోని గొట్టపు బావి నుండి పైపుల ద్వారా మంటలను ఆర్పారు. దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. మంటలు ఆర్పిన తర్వాత రైలును ప్రీతమ్ నగర్‌కు తీసుకొచ్చారు. రత్లాం నుంచి వచ్చిన రైల్వే అధికారులు రైలును పరిశీలించారు. విచారణ అనంతరం డీఈఎంయూ రైలును రత్లాంకు తీసుకుని రానున్నారు. Also Read: తొలిసారిగా డిజిటల్ కండోమ్ యాప్.. ప్రైవసీకి ఇక భయమే లేదు! #fire-accident #madhya-pradesh #demu-train మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి