/rtv/media/media_files/2025/02/08/VQjvgOWkAYSwn3u6Lh2f.jpg)
Lieutenant Governor VK Saxena
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఆదేశాల మేరకు ఢిల్లీ సచివాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏ ఫైలు బయటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. కంప్యూటర్ హార్డ్‌వేర్ మొదలైన వాటిని బయటకు తీసుకెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ఏ ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకూడదని.. ప్రతి ఒక్క ఫైల్ భద్రపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సక్సేనా ఆదేశాలు సంచలనంగా మారాయి. గత పదేళ్లుగా ఆప్ ప్రభుత్వ పాలనపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే కేజ్రీవాల్ అవినీతిపై సిట్ విచారణ చేస్తామని, అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశ పెడతామని తెలిపారు.