ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. కేంద్ర కీలక నిర్ణయం

ఢిల్లీలో పొగమంచు కారణంగా ఉద్యోగులు షిఫ్ట్‌లలో పనిచేయడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందులు షిఫ్టుల్లో పూల్ వెహికల్ విధానాన్ని అనుసరించడంతోపాటు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలని తెలిపింది.

New Update
air

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతుంది. గాలిలో వాయు నాణ్యత సూచీ 400కి పైగానే నమోదవుతుంది. ఇప్పటికే ఢిల్లీలో పలు ఆంక్షలు పెట్టారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ప్రైవేట్ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తుల పనివేళల్లో కూడా మార్పులు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!

పూల్ వెహికల్ విధానాన్ని అనుసరించాలని..

కాలుష్యం కారణంగా ఉద్యోగులు షిఫ్ట్‌లలో పనిచేయడానికి వెసులుబాటు కల్పించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందులు షిఫ్టుల్లో పూల్ వెహికల్ విధానాన్ని అనుసరించాలని  తెలిపింది. సొంత వాహనాలు కంటే ప్రజా రవాణాను ఉపయోగించాలని తెలిపింది. దీనివల్ల కొంత వరకు కాలుష్యాన్ని అరికట్టవచ్చని భావించింది. 

ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు, దిల్లీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని సీఎం అతిశీ ఆదేశించారు.

ఇది కూడా చూడండి:  బద్దశ‌త్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?

ఇదిలా ఉండగా.. ఇప్పటికే కూల్చివేతలు, నిర్మాణ పనులను ఆపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే అవసరం లేని భారీ వాహనాలను కూడా సిటీలో నిషేధం విధించారు. కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 1000 కంటే ఎక్కువగా ఉంది. అధిక కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

ఇది కూడా చూడండి:  AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!

బెంగళూరు పెద్ద సిటీ. ఇక్కడ మహిళలపై వేధింపులు కామన్. ఈ మాట అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. ఈ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి.  తాజాగా జరిగిన ఓ సంఘటనపై ఆయన ఈ విధంగా స్పందించారు.

New Update
ks

KS Home Minister Parameswara

కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై అక్కడి మహిళలు మండిపడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. బెంగళూరులోని బీటీఎం లే అవుట్ లో ఒక వ్యక్తి ఇద్దరు యువతులను ఫాలో అయి...అందులో ఒకామెతో అసభ్యంగా ప్రవర్తించి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపైనే హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. పైగా బెంగళూరు పెద్ద సిటీ.. అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు కామన్ అంటూ కొట్టిపడేశారు. ఇంకే ముందీ..ఈ వ్యాఖ్యలు కాస్తా పెద్ద దుమారాన్ని రేపాయి. హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడ్డం సరి కాదంటూ మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు. 

అబ్బే అదేమీ పెద్ద విషయం కాదు..

అయితే బెంగళూరులో వేధింపులకు గురైన అమ్మాయిలు తమకు జరిగిన దానిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అమ్మాయిని వేధించిన వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి కూడా చెప్పారు. కమిషనర్ తో తాను ఫోన్ లో మాట్లాడానని..ఇలాంటి ఘటనలు వైరల్ అయినప్పుడు కామన్ గానే ప్రజల దృష్టి వాటిపైకి వెళుతుందని ఆయన అన్నారు. అంతేకానీ అదేమీ పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్టు మాట్లాడారు. చర్యలు తీసుకుంటామని చెప్పి ఊరుకుంటే అయిపోయేది..కానీ పరమేశ్వర అనవసరంగా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు అదే ఆయన నెత్తి మీదకు వచ్చింది. అందరితో తిట్లు తినేలా చేసింది. 

 

today-latest-news-in-telugu | home-minister

 

Also Read: Trump Tariffs: ట్రంప్ సుంకాల దెబ్బకు పడిపోయిన చమురు ధరలు..కంగారులో రష్యా

Advertisment
Advertisment
Advertisment