Delhi liquor policy : ఢిల్లీ లిక్కర్ పాలసీలో కొత్త ట్విస్ట్.. కాగ్ సంచలన రిపోర్టు!

ఢిల్లీలో ఆప్ సర్కార్ 2021 22లో తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీతో ప్రభుత్వానికి  2 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించిందని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు.  వివిధ మినహాయింపులు,  నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఈ నష్టం సంభవించిందని ఆమె తెలిపారు.

New Update
Delhi liquor policy

ఢిల్లీలో ఆప్ సర్కార్ 2021 22లో తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీతో ప్రభుత్వానికి రూ. 2  వేల కోట్ల నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా  166 పేజీలతో  వెల్లడించింది.  వివిధ మినహాయింపులు,  నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఈ నష్టం సంభవించిందని కాగ్ తెలిపింది.  ఢిల్లీ అసెంబ్లీలో సీఎం రేఖ గుప్తా మద్యం కుంభకోణంపై కాగ్ నివేదికను సమర్పించారు.  ఈ నివేదికను ఆప్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టడంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.  

అనుకూలత లేని ప్రాంతాల్లో రిటైల్ దుకాణాలు తెరవకపోవడం వల్ల రూ. 941.53 కోట్ల నష్టం. సరెండర్ చేయబడిన లైసెన్స్‌లను తిరిగి టెండర్ చేయకపోవడం ద్వారా రూ.890 కోట్ల నష్టం, కరోనా 19 కారణంగా ఎక్సైజ్ శాఖ సలహా ఉన్నప్పటికీ జోనల్ లైసెన్స్ హోల్డర్లకు సుంకం మినహాయింపులు ఇవ్వడం ద్వారా రూ. 144 కోట్లు నష్టం, జోనల్ లైసెన్స్ హోల్డర్ల నుండి సరైన సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకపోవడం వల్ల, ప్రభుత్వ ఖజానాకు రూ.27 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తన రిపోర్టులో స్పష్టం చేసింది.  నవంబర్ 2021 నుండి సెప్టెంబర్ 2022 వరకు ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్, 2010లోని 35వ నిబంధనను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు మద్యం లైసెన్సుదారులను శిక్షించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని కాగ్ తెలిపింది.  

ఆప్ అగ్ర నాయకుల అరెస్టు

కాగా మద్యం పాలసీ కుంభకోణంలో భారీ ఆర్థిక అవకతవకలకు దారితీసిందని ఆరోపిస్తూ ఆప్ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ సహా ఆప్ అగ్ర నాయకుల అరెస్టు అయి బెయిల్ పై రిలీజ్ అయ్యారు.  

Also read :  Attempted murder : మైనర్‌ ప్రేమ.. దానికి ఒప్పుకోలేదని......

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు