/rtv/media/media_files/2025/02/20/aSGNcU9OC6eSrqgky6zY.jpg)
ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం ఎవరో అనేది బీజేపీ తేల్చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను సీఎం పదవి వరించింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్నికల్లో ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ, రేఖా గుప్తాను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించారు.
Also Read : ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!
రేఖా గుప్తా 2025 ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తాతో పాటుగా మరో ఆరుగురు గురువారం రోజున రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత రేఖా గుప్తా ఢిల్లీకి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి అవుతారు. దేశంలో మమతా బెనర్జీతో పాటుగా ఆమె రెండో మహిళా ముఖ్యమంత్రి అవుతారు. అలాగే, ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆమె ఏకైక మహిళా ముఖ్యమంత్రి అవుతారు. అయితే ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఉంటారా లేదా అనే దానిపై పార్టీ నుండి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఢిల్లీ మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read : కేసీఆర్ పై కేసు వేసిన వ్యక్తి మర్డర్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ఆస్తులెంత.. అప్పులెంత?
ఈ క్రమంలో రేఖా గుప్తా ఆస్తులెంత,ఆప్పులెంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, రేఖా గుప్తా మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.5.3 కోట్లు కాగా అప్పులు రూ. 1.2 కోట్లు. ఈమె ఎల్‌ఎల్‌బి చదివారు. రేఖా గుప్తా దగ్గర రూ.1,48,000 నగదు ఉంది. ఆమె బ్యాంకు ఖాతాలో రూ. 72.94 లక్షలు డిపాజిట్ ఉంది. ఆమెకు వివిధ కంపెనీలలో వాటాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఆమెకు ఎల్ఐసీలో రూ. 53 లక్షల పెట్టుబడి కూడా ఉంది.
Also Read : అబ్బే బర్డ్ ఫ్లూను పట్టించుకోవట్లే..భారీగా పెరిగిన చికెన్ ధరలు
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా పేరు మీద ఒక్క కారు కూడా లేదు. ఆమె భర్త పేరు మీద మారుతి XL6 కారు ఉంది, దాని ధర రూ. 4,33,500. ఇక రేఖా గుప్తా వద్ద 225 గ్రాముల బరువున్న ఆభరణాలు ఉన్నాయి, వాటి విలువ రూ. 18 లక్షలు. ఆమె భర్త వద్ద 135 గ్రాముల ఆభరణాలు ఉన్నాయి, వాటి విలువ రూ.11 లక్షలు. మొత్తం చరాస్తుల గురించి మాట్లాడుకుంటే ఆమెకు రూ. 2 కోట్ల 72 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. కాగా ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రేఖా గుప్తా షాలిమార్ బాగ్ స్థానం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థిని దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
Also Read : Zelensky: ట్రంప్ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు!