Air Pollution: పొగమంచు ఎఫెక్ట్.. ఢిల్లీలో పనివేళల్లో మార్పులు

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ట్రాఫిక్ దృ‌ష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలకు పనివేళల్లో మార్పులు చేశారు. అలాగే ఆరవ తరగతి నుంచి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పకుండా మాస్క్ ధరించాలని సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.

New Update
air

దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోతుంది. వరుసగా మూడో రోజు ఏక్యూఐ తీవ్రస్థాయిలో ఉంది. ఈ రోజు వాయు నాణ్యత సూచీ 428గా నమోదైంది. వాయు కాలుష్యం పెరగడంతో ఢిల్లీలో ప్రాథమిక స్కూళ్లకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కాలుష్యం నేపథ్యంలో ఆరు నుంచి మిగతా తరగతులు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పకుండా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇది కూడా చూడండి: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే?

ట్రాఫ్రిక్‌ను దృష్టిలో పెట్టుకుని..

పొగమంచుకి దారి కూడా సరిగ్గా కనబడక ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిపోతుంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చారు. ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు, దిల్లీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని సీఎం అతిశీ ఆదేశించారు.

ఇది కూడా చూడండి: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న కారణం వల్ల అవసరం లేని నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కూల్చివేతలపై కూడా నిషేధం విధించింది. వీటితో పాటు బీఎస్‌-3 పెట్రోల్, బీఎస్‌-4 డీజిల్‌ వాహనాల ప్రయాణాలను నిషేధించాయి. త్వరలో 106 క్లస్టర్ బస్సులు,  మెట్రో సేవలను కూడా మరింత పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. 

ఇది కూడా చూడండి: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం

ఢిల్లీలో ఉండే కాలుష్యానికి అక్కడి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. గాలి నాణ్యతను పెంచడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఈ కాలుష్యం వల్ల ఢిల్లీలో చాలా కుటుంబాలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. 

ఇది కూడా చూడండి: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jallianwala Bagh: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

1919 ఏప్రిల్‌ 13న జరిగిన జలియన్ వాలాబాగ్‌మరణకాండ ఘటన నేటితో 106 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ నివాళులర్పించారు. జలియన్ వాలాబాగ్‌ ఘటన గురించి పూర్తిగా తెలుసుకునేందుకు టైటిల్‌ క్లిక్ చేయండి.

New Update
106th Jallianwala Bagh massacre anniversary

106th Jallianwala Bagh massacre anniversary

బ్రిటీష్ వాళ్లు భారత్‌ను పాలించే రోజుల్లో అనేక పోరాటాలు జరిగాయి. ఇందులో జలియన్‌ వాలాబాగ్ ఘటన స్వాతంత్ర్యోమాన్ని మలుపు తిప్పింది. ఈ మరణకాండ తర్వాత దేశమంతా రగిలిపోయింది. స్వాతంత్ర్యం కోసం నిరసనలు, ఉద్యమాలు మరింత ఉద్ధృతమయ్యాయి. 1919 ఏప్రిల్‌ 13న జరిగిన ఈ విషాద ఘటన నేటితో 106 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తదితరులు జలియన్‌వాలా బాగ్‌ అమరులకు నివాళులు అర్పించారు.

జలియన్‌ వాలాబాగ్‌ జరగడానికి గల కారణాలేంటి ? బ్రిటిషర్లు ఎందుకంతా క్రూరంగా ప్రవర్తించారో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యంలో మొత్తం లక్షా 96 వేల మంది సైనికులు ఉన్నారు. అందులో లక్షా పదివేల మంది పంజాబీలే ఉన్నారు. మరోవైపు సైనికుల్లో జాతీయ భావాలు చిగురిస్తున్నాయి. దేశభక్తి ఉప్పొంగుతోంది. అలాంటి పరిస్థితుల్లో సైనికులు తమపై తిరుగుబాటు చేస్తే వీళ్లని కట్టడి చేయడం కష్టమని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది.  

ముఖ్యంగా పంజాబ్‌లో మారుతున్న పరిస్థితులు బ్రిటిషర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయులను అణిచివేసేందుకు కొత్త చట్టాలు తీసుకురావాలనుకున్నారు. ఫలితంగా రౌలత్‌ చట్టాన్ని తీసుకొచ్చేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం సమాలోచనల్లో ఉంది. పౌరుల స్వేచ్ఛను హరించేలా ఉన్న ఈ చట్టం తీసుకొచ్చే ప్రయత్నాలపై దేశంలో నిరసనలు జరిగాయి. ఈ నల్లచట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు నిర్వహించారు. 

Also Read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

నిరసనలు మరింత ముదిరాయి. ఇందులో భాగంగానే అమతృత్‌సర్‌లో కూడా నిరసనలు చేపట్టారు. ఇద్దరు సీనియర్ నాయకులను అరెస్టు చేయడంతో అమృత్‌సర్‌ ప్రాంతమంతా ఆగ్రహంతో ఊగిపోయింది. కత్రా జైమల్ సింగ్, హాల్ బజార్, ఉఛాపుల్ ప్రాంతాలలో 20,000 మంది ప్రజలు బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. 

ఒకటి రెండు హింసాత్మక ఘటనల వల్ల పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌ మైకేల్ ఒ డయ్యార్‌ స్పందించాడు. పరిస్థితిని నియంత్రించడం కోసం జలంధర్‌లో ఉన్న సైనికాధికారి జనరల్ ఆర్‌.డయ్యార్‌కు కబురుపెట్టాడు. అయితే సమాచార లోపం వల్ల ప్రజలు పెద్దఎత్తున జలియన్ వాలాబాగ్‌కు వచ్చారు. అదేరోజున పంజాబీలకు పెద్ద పండుగైన వైశాఖీ ఉంది. శ్రీ హర్మిందర్ సాహిబ్‌లో దైవప్రార్థనలకు వచ్చిన వాళ్లు తోటలో చేరారు. మరోవైపు గోవిందగఢ్‌ పశు మేళాకు వచ్చిన వాళ్లు కూడా ఇక్కడే ఉన్నారు. పలువురు గూఢచారులు జలియన్ వాలా బాగ్‌ లోపల ఏం జరుగుతుందో జనరల్ ఆర్ డయ్యార్‌కు సమాచారం అందిస్తున్నారు. 

జలియన్‌ వాలా బాగ్‌లో సత్యాగ్రహుల సమావేశం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 3 గంటలకే జనాలు పెద్ద సంఖ్యలో వచ్చేసారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి 5.15 నిమిషాల మధ్య పాతికేసి సైనికులతో కూడిన నాలుగు సైనిక బృందాలతో డయ్యార్‌ జలియన్ వాలా బాగ్‌కు వచ్చాడు. ఈ బృందాల్లో 50 మంది సైనికులు గూర్ఖా రెజిమెంట్‌కు, అఫ్ఘాన్ రెజిమెంట్‌కు చెందిన వాళ్లున్నారు. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

ఇక జనరల్ డయ్యార్‌ వెంటనే కాల్పులకు ఆదేశించాడు. దీంతో బ్రిటిష్ సైనికులు అక్కుడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మరణకాండంలో దాదాపు 1000 మంది చనిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. మరో 2 వేల మంది గాయాలపాలయ్యారు. కాల్పులు జరిగిన తర్వాత గాయపడ్డ వాళ్లకి దాహం తీర్చుకునేందుకు చుక్క మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఆసమయంలో కనీసం మంచినీరు, వైద్యసాయం అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 

జలియన్ వాలాబాగ్‌ ఘటన జరిగిన తర్వాత జనరల్ డయ్యర్‌ ఇంగ్లాడ్‌కు వెళ్లిపోయాడు. భారత్‌లో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ డయ్యర్‌ను సస్పెండ్ చేసింది. ఇక ఉధమ్‌ సింగ్‌ లండన్‌లో 1940 మార్చి 13న డయ్యర్‌ను కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. స్వాంతత్ర్య వీరుల స్మృతి చిహ్నంగా జలియన్ వాలాబాగ్‌లో భారత ప్రభుత్వం ఓ స్మారక స్థూపాన్ని నిర్మించింది. మాజీ రాష్ట్రపతి డా.బాబు రాజేంద్రప్రసాద్ ఈ స్థూపాన్ని ప్రారంభించారు. 

telugu-news | rtv-news | national-news | british

Advertisment
Advertisment
Advertisment