Dana Cyclone:దానా తుపాను.. గర్భిణుల అవస్థలు..ఒకే సారి 1600 మంది ప్రసవం

దానా తుపాన్‌ ఒడిశాలో తీరాన్ని తాకింది. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మందిని సురక్షిత కేంద్రాలకు తరలించారు. వారిలో సుమారు 4,500 మంది గర్భిణులు ఉన్నారు. వీరిలో 1,600 మంది ఇప్పటికే ప్రసవించారని అధికారులు తెలిపారు.

New Update
Vishakhapatnam Rains: విశాఖలో భారీ వర్షం.. రాకపోకలు, స్కూళ్లు బంద్‌

Dana Cyclone: దానా తుపాన్‌ శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన తుపాన్‌ గా ఒడిశాలో (Odisha) తీరాన్ని తాకింది. తుపాన్‌ తీరాన్ని దాటే సమయంలో భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వచ్చాయి. ఈ బీభత్సం శుక్రవారం బలహీనపడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు ఒడిశా తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మందిని సురక్షిత కేంద్రాలకు తరలించారు.

Also Read: ఇజ్రాయెల్‌తో యుద్ధం.. సైన్యానికి ఇరాన్‌ కీలక ఆదేశాలు..ఏ క్షణంలోనైనా..!

1,600 మంది ప్రసవం..

సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారిలో సుమారు 4,500 మంది గర్భిణులు ఉన్నారు. వీరిలో 1,600 మంది ఇప్పటికే ప్రసవించారని ఒడిశా  ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గురువారం ప్రకటించారు. రాష్ట్రం మొత్తం అధికారులు 584,888 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. 

Also Read: సంధి దిశగా ఇజ్రాయెల్‌-హమాస్‌ !

 శుక్రవారం నాటికి ఆ సంఖ్య 600,000 దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిర్వాసితులు ప్రస్తుతం 6,008 తుఫాను షెల్టర్లలో ఉన్నారని తెలిపారు.  అక్కడ ఆహారం, మందులు, నీరు, ఇతర అవసరమైన సామాగ్రిని పొందుతున్నారని మాఝీ తెలిపారు. బాలాసోర్ జిల్లా నుంచి అత్యధికంగా 172,916 మంది  ప్రజలును సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. 

Also Read: ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ థ్యాంక్స్.. జానీ మాస్టర్ షాకింగ్ పోస్ట్

మయూర్‌భంజ్ నుంచి 100,000 మందిని తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ''హైరిస్క్ ప్రాంతాల నుండి ప్రజలందరినీ విజయవంతంగా తరలించాము" అని మాఝీ పేర్కొన్నారు. ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల కేంద్రం సంతృప్తిగా ఉందని చెప్పారు. 

Also Read:  తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు