/rtv/media/media_files/2025/03/03/TsBFYpp8xDDNxYFmumNL.jpg)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కాంగ్రెస్ మహిళా నేత డాక్టర్ షామా మొహమ్మద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ ఫ్యాట్ గా ఉంటాడని, బరువు తగ్గాలంటూ ఆమె కామెంట్ చేశారు. అంతేకాకుండా.. రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దూమరాన్ని రేపాయి. ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారడం, కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సహా బీజేపీ నేతలు, క్రికెట్ అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడటంతో షామా వెంటనే తన పోస్టును డిలీట్ చేసింది.
అయితే రోహిత్ శర్మపై చేసిన కామెంట్స్ ను ఆమె ఢిఫెండ్ చేసుకోవడం గమనార్హం. తాను అన్నదాంట్లో తప్పేమీ లేదంటూ డాక్టర్ షామా చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందన్నారు. రోహిత్ ఫిట్‌నెస్ గురించి తాను సాధారణ ట్వీట్ మాత్రమే చేశానని.. ఇది బాడీ షేమింగ్ కాదన్నారు. ఒక క్రీడాకారుడు ఫిట్‌గా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపారు. రోహిత్ కొంచెం బరువుగా ఉన్నాడని భావించాను, కాబట్టి నేను దాని గురించి ట్వీట్ చేసానని తెలిపారు. తాను ఇలా చెప్పడంలో తప్పు ఏమిటని ఆమె ప్రశ్నించారు. అయితే తప్పు లేనప్పుడు పోస్టు ఎందుకు డిలీట్ చేయడమని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు.
Also Read : Hyderabad: చనిపోయిందా, చంపేశారా.. మిస్టరీగా మారిన శిరీష డెత్
ఇంతకు ఏం జరిగిందంటే
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ట్విట్టర్ వేదికగా రోహిత్ శర్మపై కామెంట్ చేశారు. రోహిత్ శర్మ ఫ్యాట్ గా ఉంటాడు, బరువు తగ్గాలి. ఇప్పటివరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ షామా తన పోస్టులో శర్మపై విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ నేతలు ఆమెపై మండిపడ్డారు.
కెప్టెన్ రోహిత్ శర్మపై షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ మాట్లాడుతూ, "నేను వ్యక్తిగతంగా, పార్టీ కూడా ఎవరినీ బాడీ షేమింగ్ చేయడాన్ని ఆమోదించను. దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుడి గురించి ఇలా మాట్లాడటం సరికాదు అని అన్నారు.
#WATCH | On Shama Mohamed's comments on Indian cricket team captain Rohit Sharma, Congress MP Rajani Patil says, "I personally and the party also will not approve of body shaming anyone. Talking this way about a sportsperson who represents the country is not right. The party will… pic.twitter.com/5Vy61IDO2J
— ANI (@ANI) March 3, 2025