Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్(Congress) ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. 2025 జనవరి 29వ తేదీన ఐదు గ్యారెంటీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోను ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఆవిష్కరించగా.. ఆయన వెంట కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జి జైరాం రమేష్ ఉన్నారు.
Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వస్తే కుల గణనను నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అంతేకాకుండా పూర్వాంచల్ వాళ్ల కోసం ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది.
ఇక మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ తో పాటుగా ప్రతినెలా రూ. 2 వేల 500ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించింది. వీటితో పాటుగా ఆందరికీ ఆరోగ్యం స్కీమ్ కింద రూ. 25 లక్షల వరకు భీమా సౌకర్యాన్ని అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. మెహంగై ముక్తి యోజన కింద సిలిండర్‌కు రూ. 500 చొప్పున వంటగ్యాస్, ఉచిత రేషన్ కిట్ ఇస్తామని తెలిపింది. ఇక వితంతువులకు దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, సీనియర్ సిటిజన్లు, నిరుపేదలకు నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం
మేనిఫెస్టోలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఒక సంవత్సరానికి నెలకు ₹8,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 5 రూపాయలకే భోజనం అందించే 100 ఇందిరా క్యాంటీన్లను నగరం అంతటా ప్రారంభించాలని కూడా పార్టీ ప్రతిపాదించింది.
Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీలోని మొత్తం 70 నియోజవర్గాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు.
Also Read : హైదరాబాద్‌లో 52 మంది సైబర్ నేరగాళ్లు అరెస్టు.. బ్యాంకు మేనేజర్ సహా..!