Cockroach Janata Party : నీట్ అక్రమాలపై 'కాక్రోచ్ జనతా పార్టీ' సమరభేరి: వేలాది మంది యువతతో దేశరాజధాని షేక్

NEET పేపర్ లీక్, CBSE ఓఎస్‌ఎం వ్యవస్థలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్‌ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ఉదయం చేపట్టిన ఆందోళనతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

New Update
FotoJet - 2026-06-06T135625.034

Cockroach Janata Party

Cockroach Janata Party : నీట్ (NEET) పేపర్ లీక్, సీబీఎస్‌ఈ (CBSE) ఓఎస్‌ఎం వ్యవస్థలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్‌ జనతా పార్టీ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ఉదయం చేపట్టిన ఆందోళనతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ డిజిటల్ ఉద్యమ సంస్థ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుని ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన అభిజీత్.. ‘డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మై ఆటోగ్రఫీ’ పుస్తకాన్ని చేతితో పట్టుకుని ప్రదర్శిస్తూ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఉదయం 11 గంటలకు జంతర్ మంతర్ చేరుకున్నారు.

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (3)_0

అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది విద్యార్థులు, యువత జంతర్ మంతర్ నిరసన వేదికకు తరలివచ్చారు. అక్కడ అభిజీత్‌కు మద్దతుదారులు 'భారత్ మాతా కీ జై', 'ఇంక్విలాబ్ జిందాబాద్', 'జై భీమ్' నినాదాలతో ఘన స్వాగతం పలికారు. ఈ ఆందోళనలో అనేకమంది యువకులు 'బొద్దింకల' వేషధారణలో హాజరై నిరసన తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులు.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’, ‘మేము మేక్ ఇన్ ఇండియా అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు’ అంటూ ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (4)_0

ఈ సందర్భంగా నిరసనకారులను ఉద్దేశించి అభిజీత్ దీప్కే మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "బొద్దింకలకు భయం ఉండదని, అవి ఎప్పటికీ చనిపోవని" పేర్కొంటూ.. దేశ యువత కూడా ఇకపై దేనికీ భయపడదని, తమ హక్కుల కోసం చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు ఎదురవుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు తాము ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని, అప్పటివరకు విశ్రమించబోమని భీష్మించుకూర్చున్నారు.

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (5)_0

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 6న ఈ నిరసన కార్యక్రమం జరగడంతో ఢిల్లీ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జంతర్ మంతర్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్‌లో ఉన్న అభిజీత్ నివాసం వద్ద కూడా పోలీసులు భద్రతను మోహరించారు. కాగా, ఈ నిరసనలకు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఇప్పటికే తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఒకవేళ ఈ నిరసనల్లో భాగంగా పోలీసులు అభిజీత్‌ను కానీ, సీజేపీ సభ్యులను కానీ అరెస్టు చేస్తే తాను 42 రోజుల పాటు నిరాహార దీక్ష చేపడతానని వాంగ్‌చుక్ హెచ్చరించడంతో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా మరింత హీటెక్కింది.

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (21)

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (8)_0

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (7)_0

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (20)

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (23)

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (11)_0

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (12)_0

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (25)

New Delhi  Cockroach Janta Party at the Jantar Mantar_ (19)

Advertisment
తాజా కథనాలు