/rtv/media/media_files/2025/04/14/qjgzfvedncxIJJLfCzK4.jpg)
Coast guards seize rs 1800 crore drugs
Coast guards seize rs 1800 crore drugs : గుజరాత్‌లో రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. వీటిని స్మగ్లర్లు పారిపోయే ముందు అరేబియా సముద్రంలో పడేసినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్‌ను మెథాంఫేటమిన్‌గా అనుమానిస్తున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్న ఆ డ్రగ్స్‌ను యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు అప్పగించినట్లు తీర గస్తీదళం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
దేశంలోకి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు చేసిన ప్రయత్నాలను తీర గస్తీదళం భగ్నం చేసింది. అరేబియా సముద్రంలో స్మగ్లర్లు విసిరేసిన రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ ను కోస్ట్‌గార్డ్, గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
అరేబియా సముద్రంలో భారత సముద్ర జలాల సరిహద్దు వద్ద ఏప్రిల్ 12--13 అర్ధరాత్రి వేళ తీర గస్తీదళం, ఏటీఎస్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఓ బోటు కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో దాని దగ్గరకు వెళ్లాయి. కోస్ట్‌గార్డ్ నౌకను చూడగానే బోటులోని స్మగ్లర్లు తమ వద్ద ఉన్న సరకును సముద్రంలో పడేసి పారిపోయారు.
Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
కోస్ట్ గార్డ్, ఏటీఎస్ సిబ్బంది సముద్రంలోకి దిగి సరకును పట్టుకున్నారు. అందులో 300 కిలోలకు పైగా నిషేధిత మెథాంఫేటమిన్ అనే మాదకద్రవ్యాలు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1800కోట్ల పైనే ఉంటుందని పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్న ఆ డ్రగ్స్‌ను ఏటీఎస్‌కు అప్పగించినట్లు తీర గస్తీదళం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..