CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. అలా చేస్తే అకౌంట్లోకి వెంటనే రూ. లక్ష!

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు టీవీకే చీఫ్ , దళపతి విజయ్.. తాజాగా రాష్ట్రంలో అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

New Update
vijay

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు టీవీకే చీఫ్ , దళపతి విజయ్.. తాజాగా రాష్ట్రంలో అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వేళ్లతో సహా పెకలించి వేసేందుకు అత్యంత విజయ్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.

"ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే.. వెనకడుగు వేయకండి, భయపడకండి.. నేరుగా ప్రభుత్వానికే పట్టించండి" అంటూ సీఎం విజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు.  ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరైనా కేవలం వెయ్యి రూపాయలు లంచం అడిగినా.. దాన్ని సాక్ష్యాధారాలతో (ఆడియో లేదా వీడియో రూపంలో) ప్రభుత్వానికి అందిస్తే, సదరు ఫిర్యాదుదారునికి రూ.1,00,000 నగదు ప్రోత్సాహకాన్ని రివార్డుగా అందజేస్తామన్నారు. లంచగొండుల సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని, వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అవినీతి ఉద్యోగుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చిన్న పనికి కూడా లంచం ఆశించే కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు అందరిలోనూ వణుకు మొదలైంది. 

ప్రజలు ప్రశంసల వర్షం

తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన ఈ వినూత్న స్కీమ్‌పై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అవినీతిని అంతమొందించడానికి ఇదొక విప్లవాత్మకమైన అడుగు అని, మిగిలిన రాష్ట్రాలు కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ఇమేజ్‌ను పక్కన పెట్టి, నిజ జీవితంలోనూ నాయకుడు అనిపించుకునేలా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు