Arvind Kejriwal: జైలు నుంచి బయటకి వచ్చిన సీఎం కేజ్రీవాల్.. లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేజ్రీవాల్ జెలు నుంచి విడుదలయ్యారు. దాదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ఎట్టకేలకు బయటికొచ్చేశారు. By B Aravind 13 Sep 2024 | నవీకరించబడింది పై 13 Sep 2024 19:59 IST in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Arvind Kejriwal Released From Jail: లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేజ్రీవాల్ జెలు నుంచి విడుదలయ్యారు. దాదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ఎట్టకేలకు బయటికొచ్చేశారు. ఆయనకు స్వాగతం పలికేందుకు తీహార్ జైలకు ఆప్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బయటకి వచ్చిన అనంతరం కేజ్రీవాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' ఈ రోజు నేను జైలు నుంచి బయటకు వచ్చేశాను. నా ధైర్యం 100 రేట్లు పెరిగింది. జైలు గోడలు కేజ్రీవాల్ ధైర్యాన్ని బలహీనంగా చేయలేవు. సరైన మార్గంలో ముందుకు నడిపించడం కొనసాగించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తాను. దేశాన్ని అస్థిరపరిచేందుకు, ప్రజల మధ్య విభజన సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అన్ని శక్తులపై నా పోరాటం కొనసాగిస్తాను. నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ప్రతి దశలో దేవుడు నాకు అండగా ఉన్నాడు. నేను నిజాయతిపరుడిని కాబ్టటే ఈసారి కూడా దేవుడే నన్ను ఆదుకున్నాడు '' అని కేజ్రీవాల్ అన్నారు. Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్‌ను లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఇటీవల ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే కేజ్రీవాల్ కు కూడా బెయిల్ వస్తుందని ఆప్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు. చివరికి ఆయన బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు పూచీకత్తులతో పాటు రూ.10 లక్షల బెయిల్ బాండ్లను ఇవ్వాలని ఆదేశించింది. #national-news #tihar-jail #arvind-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి