బస్తర్ అడవుల్లో ఖాకీల ఎత్తగడ.. మాజీ మావోయిస్టులతో పోలీసులకు ట్రైనింగ్!

ముల్లును ముల్లుతోనే తీయాలి అనే కోణంలో డిపార్ట్‌మెంట్ ఓ కొత్త ప్లాన్ వేసింది. శత్రువును దెబ్బతీయాలంటే శత్రువు ఎత్తుగడలే ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించారు. లొంగిపోయిన మావోయిస్టులతో పోలీసులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు.

New Update
_Maoists training police

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టులను ఎదుర్కోవడంలో బస్తర్ పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అనే కోణంలో డిపార్ట్‌మెంట్ ఓ కొత్త ప్లాన్ వేసింది. శత్రువును దెబ్బతీయాలంటే శత్రువు ఎత్తుగడలే ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించారు. లొంగిపోయిన మావోయిస్టులతో పోలీసులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. IED గుర్తించడం, ఎమర్జెన్సీ మెడికల్ సపోర్ట్, గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో ఆరితేరిన అన్నలతోటి పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఇందుకోసం సుక్మా, బీజాపూర్, దంతేవాడ, కాంకేర్ జిల్లాల నుంచి ఎంపిక చేసిన మాజీ మావోయిస్టులను ప్రత్యేక నోడల్ అధికారుల పర్యవేక్షణలో శిక్షణా కేంద్రానికి తరలించారు.

SI, DSPలకు నెల రోజులు నక్సల్స్ ట్రైనింగ్

ఛత్తీస్‌గఢ్ కాంకేర్‌లోని కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్‌ఫేర్ (CTJW) కాలేజ్‌లో ఈ ట్రైనింగ్ ప్రారంభమైంది. లొంగిపోయిన డజనుకు పైగా మావోయిస్టు కార్యకర్తలు ఇప్పుడు కొత్తగా చేరిన సబ్-ఇన్‌స్పెక్టర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)లకు పాఠాలు చెబుతున్నారు. మావోయిస్టులు అనుసరించే గెరిల్లా యుద్ధ వ్యూహాలు, వారి కార్యాచరణ పద్ధతులపై పోలీసులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తున్నారు.

బస్తర్ అడవుల్లో మావోయిస్టులు అమర్చే మందుపాతరలు (IEDs) భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మారాయి. సాంకేతికతతో కూడా గుర్తించలేని విధంగా వీటిని అమర్చడంలో మావోయిస్టులు దిట్టలు.
గుర్తులు: ఐఈడీలను అమర్చిన చోట గుర్తు కోసం ఆకులను ఒక విచిత్రమైన పద్ధతిలో అమరుస్తారని లొంగిపోయిన కేడర్ పోలీసులకు వివరించారు.
టెక్నాలజీ vs ఎక్స్‌పీరియన్స్: కేవలం పరికరాలపైనే ఆధారపడకుండా, అడవిలోని మార్పులను బట్టి ప్రమాదాన్ని ఎలా గుర్తించాలో ఈ శిక్షణలో నేర్పిస్తున్నారు.

మావోయిస్టుల రహస్యాలు 

మావోయిస్టుల మెడికల్ వింగ్‌లో పనిచేసిన వారు కూడా ఈ శిక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్‌కౌంటర్లలో తీవ్రంగా గాయపడిన సీనియర్ మావోయిస్టులు కూడా అడవుల్లో సరైన వసతులు లేకున్నా ఎలా ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నారు? వారి చికిత్సా విధానాలు ఏమిటి? అనే అంశాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నారు. అల్లోపతి వైద్యంతో పాటు వారు అనుసరించే ప్రథమ చికిత్స పద్ధతులు అడవుల్లో పనిచేసే జవాన్లకు ప్రాణరక్షకవచంగా మారతాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు