ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే

దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. పటాసుల మోతతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మాత్రం ఈ పండుగకు దూరంగా ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

New Update
deepavali

దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. పటాసుల మోతతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మాత్రం ఈ పండుగకు దూరంగా ఉంది. గతంలో సతీసహగమనానికి గురైన ఓ మహిళ శాపం వల్ల దీపావళి పండుగను అక్కడ జరుపుకోకూడదనే ఆచారం కొనసాగుతూనే ఉంది. ఇంతకీ వీళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.       

Also Read: ఒక్క అంగుళం కూడా వదులుకోం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

పండగ రోజే భర్త మరణం

ఇక వివరాల్లోకి వెళ్తే.. చాలా ఏళ్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీన్‌పుర్ జిల్లా సమ్మూ గ్రామానికి చెందిన ఓ మహిళ దీపావళి పండుగ కోసం తన పుట్టింటికి బయలుదేరింది. అయితే ఆలోపే రాజు ఆస్థానంలో పనిచేస్తున్న తన భర్త చనిపోయాడనే మరణవార్త వచ్చింది. అప్పటికే గర్భిణిగా ఉన్న ఆమె ఒక్కసారిగా షాకైపోయింది. ఆ బాధను భరించలేక భర్త చితిపైనే ఆత్మార్పణం చేసుకుంది. ఆత్మార్పణ చేసుకునే ముందు దీపావళి పండుగ చేసుకోవద్దని శాపం పెట్టింది. దీంతో అప్పటి నుంచి ఆ ఊరిలో పండగను నిర్వహించడం లేదు.  

Also Read: TCS ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఇక 15 ఏళ్ల పాటు నో టెన్షన్!

 ఒకవేళ దీపావళి చేసుకుంటే ఊరికి ఏదో ఒక అపశకునం జరుగుతుందని ఊరి ప్రజలు భయపడుతున్నారు. అంతేకాదు ఆ గ్రామానికి చెందిన వాళ్లు ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా పండగను చేసుకోరు. ప్రత్యేకంగా వంటలు కూడా చేసుకోరు. అయితే ఓ కుటుంబం ఇలా చేసేందుకు ప్రయత్నించగా.. వాళ్ల ఇల్లు అగ్నికి కాలిపోయిందని అక్కడి వారు చెబుతున్నారు. దీంతో అప్పటి నుంచి ఆ ఊరు దీపావళికి దూరంగా ఉంటోంది. అయితే ఇక్కడున్న యువత మాత్రం ఏదో ఓ రోజు దీపావళిని చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నాల్ నివాసి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ శనివారం (ఏప్రిల్ 26) రూ.50 లక్షల పరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు.

New Update
Vinay Narwal Haryana

Vinay Narwal Haryana

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నాల్ నివాసి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ శనివారం (ఏప్రిల్ 26) రూ.50 లక్షల పరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తల్లిదండ్రుల కోరిక మేరకు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉగ్రవాదుల పిరికి చర్యను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.

వివాహం చేసుకున్న ఆరు రోజుల తర్వాత

ఏప్రిల్ 16న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో వివాహం చేసుకున్న ఆరు రోజుల తర్వాత, ఏప్రిల్ 22న (మంగళవారం) పహల్గామ్‌లో ఉగ్రవాదులు చంపిన 26 మంది పర్యాటకులలో వినయ్ నర్వాల్ కూడా ఉన్నాడు. 26 ఏళ్ల అతను తన భార్య హిమాన్షితో హనీమూన్‌కు వెళ్లినప్పుడు ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. అతని అంత్యక్రియలు ఏప్రిల్ 23న (బుధవారం) కర్నాల్‌లో జరిగాయి. 2022లో నేవీలో చేరిన తర్వాత నర్వాల్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌లో పనిచేస్తున్నాడు వినయ్ నర్వాల్.

మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా శుక్రవారం కర్నాల్ చేరుకుని వినయ్ నర్వాల్ కు నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం ఆయన కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మేము స్వాగతిస్తున్నామని చెప్పిన భూపిందర్ సింగ్ మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  

 

 

Advertisment
Advertisment
Advertisment