/rtv/media/media_files/2026/04/08/centre-issues-fresh-advisory-for-indian-citizens-2026-04-08-15-56-00.jpg)
Centre Issues Fresh Advisory For Indian Citizens
కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌లో ఉంటున్న భారత పౌరులను మరోసారి అప్రమత్తం చేసింది. వీలైనంత త్వరగా ఆ దేశం నుంచి బయటకు రావాలని సూచించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో ఈ పోస్టు చేసింది. అయితే ఎంబసీని ముందుగా స్పందించకుండా ఏ అంతర్జాతీయ సరిహద్దు సమీపం వద్దకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకోసం పలు హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా షేర్ చేసింది. అవసరం ఉన్నవాళ్లు +989128109115; +989128109109; +989128109102; +989932179359 నెంబర్లను, mail id - [email protected] ను సంప్రదించాలని సూచించింది.
Also Read: విజయ్ పార్టీకి బిగ్ షాక్: ఎడప్పాడి బరిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ !
ఇదిలాఉండగా అమెరికా-ఇరాన్ మరో రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారతీయ ఎంబసీ ఈ సూచనలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం రాత్రి కేంద్ర విదేశాంగ శాఖ సైతం అడ్వైజరీని జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచనలు చేసింది. ఇళ్లల్లోనే ఉండాలని.. విద్యుత్, సైనిక, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో ఇరాన్‌లో ఉన్న భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ఇదో అవకాశంగా మారింది.
Also Read: శబరిమలలో మహిళలకు ప్రవేశంపై వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us