Wage Rates : కనీస వేతనాలు నెలకు 26,910 రూ.లకు పెంచిన కేంద్రం

ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వేతనాలను సవరిస్తూ...నెలకు 26, 910 రూ.లను కనీస వేతనంగా నిర్ణయించింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను సవరించింది. 

author-image
By Manogna alamuru
New Update
central

Wages For Workers : పెరుగుతున్న జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. కనీస వేతనాలను పెంచుతూ ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనం 26,910 రూ.లు ఉండాలని చెప్పింది. వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA)ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. జీవన వ్యయాన్ని ఎదుర్కోవడంలో ఇది కార్మికులకు సహాయ పడుతుందని ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త వేతన రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని అనౌన్స్ చేసింది. దీని ద్వారా ఏప్రిల్ 2024లో చేసిన చివరి సర్దుబాటుతో కలిపి..ప్రస్తుతం భవన నిర్మాణం, లోడింగ్– అన్‌లోడింగ్, వాచ్, వార్డ్, స్వీపింగ్, క్లీనింగ్, హౌస్ కీపింగ్, మైనింగ్ ఇంకా వ్యవసాయంతో సహా వివిధ రంగాలలో నిమగ్నమైన కార్మికులు -కొత్త రేట్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది.

కొత్త రూల్ ప్రకారం..నైపుణ్యం లేని కార్మికులు: రోజుకు రూ. 783 (నెలకు రూ. 20,358)
సెమీ స్కిల్డ్ వర్కర్స్: రోజుకు రూ. 868 (నెలకు రూ. 22,568)
నైపుణ్యం కలిగిన కార్మికులు, క్లరికల్ స్థానాలు: రోజుకు రూ. 954 (నెలకు రూ. 24,804)
హైలీ స్కిల్డ్ వర్కర్స్ మరియు వాచ్ అండ్ వార్డ్ విత్ ఆర్మ్స్: రోజుకు రూ. 1,035 (నెలకు రూ. 26,910) జీతం అందుకోనున్నారు.  పారిశ్రామిక కార్మికులకు ఆరు నెలల సగటు పెరుగుదల ఆధారంగా ఏప్రిల్ 1 , అక్టోబర్ 1 నుండి అమలులోకి వచ్చే VDAని కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తుంది. సెక్టార్, కేటగిరీలు, ప్రాంతాల వారీగా కనీస వేతన రేట్లకు సంబంధించిన వివరాలను clc.gov.inలో తెలుసుకోవచ్చును.

Also Read :  భార్య బికినీ కోరిక.. రూ.418 కోట్లకు ఐలాండ్ కొనేసిన భర్త!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

ప్రధాని మోదీ తమిళనాడు రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించారు. రూ.550 కోట్ల వ్యయంతో రైల్వే వంతెనను నిర్మించారు. శ్రీలంకలో 3 రోజుల పర్యటన ముగించుకొని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించారు. ఇది ఇండియాలోనే మొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్.

New Update
Modi

రామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. పంబన్ బ్రిడ్జ్ అనే రైల్వే వంతెనను రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 72.5 మీటర్ల లిఫ్ట్ నిలువుగా చైన్ లింకప్ ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌ కోటింగ్‌తో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీలంకలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించారు. 

రామ నవమి సందర్భంగా అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే రామసేతును వీక్షించడం గురించి ప్రధాని తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది దైవిక యాదృచ్చికమని ప్రధాని అభివర్ణించారు. పూరాణాల్లో పాతుకుపోయిన ఈ పంబన్ బ్రిడ్జ్ ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఆయన చెప్పారు. రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో కలుపుతూ.. ఈ వంతెనను రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2.08 కి.మీ పొడవున్న ఈ నిర్మాణంలో 99 స్పాన్‌లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్ ఉన్నాయి. ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా ట్రైన్ వెలుతుంది. కింద నుంచి ఓడలు ప్రయాణిస్తాయి. ఓడలు వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ రెండు ముక్కలుగా పైకి లేస్తోంది. ఇదే దీని స్పెషాలిటీ.

Advertisment
Advertisment
Advertisment