/rtv/media/media_files/2026/03/11/central-govt-2026-03-11-18-20-35.jpg)
Central Govt Sensational Announcement on LPG Crisis
దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సిలిండర్‌ను బుక్ చేసిన రెండ్రోజుల్లోనే డెలివరీ అవుతుందని పేర్కొంది. LPG ఉత్పత్తిని 25 శాతం పెంచినట్లు తెలిపింది. హర్ముజ్ జలసంధితో సంబంధం లేదని మార్గాల్లో చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంది. అంతేకాదు హర్ముజ్ నుంచి ఆగిపోయిన సరఫరా కంే ఎక్కువ చమురునే సేకరించినట్లు స్పష్టం చేసింది. అంతేకాదు భారత్‌కు రెండు LNG కార్గాలు కూడా రానున్నాయని తెలిపింది.
Also Read: దేశంలో ఇంధన సంక్షోభం.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం !
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసి సంగతి తెలిసిందే. దీంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. భారత్‌లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేస్తున్నారు. వంటలను పరిమితం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ బంకుల్లో కూడా వాహనాలతో క్యూలు కడుతున్నారు.
Also Read: గ్యాస్ కొరత.. తెలంగాణలో హోటళ్లకు 2 రోజుల్లో రూ.20 కోట్ల నష్టం
ఇదిలాఉండగా గ్యాస్ కొరత తెలంగాణలో సైతం హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత రెండ్రోజుల్లో రూ.20 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న సిలిండర్లు మరో 2-3 రోజుల వరకే సరిపోతాయి. హైదరాబాద్‌లో కూడా 2 రోజులకు సరిపోయే గ్యాస్ ఉందని.. ఆ తర్వాత ఇక్కడ కూడా హోటళ్లు మూతపడే పరిస్థితులు వస్తాయని హోటల్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే LPG ఉత్పత్తిని 25 శాతం పెంచినట్లు కేంద్రం కీలక ప్రకటన చేసింది.
Follow Us