Padma Awards: పద్మ అవార్డ్స్‌కు నామినేషన్ స్వీకరణ..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

కేంద్రం పద్మ పురస్కారాలకు నామినేషన్లు స్వీకరిస్తోంది. 2026 అవార్డులకు.. 2025 జులై 31లోగా నామినేషన్లు, సిఫార్సులు చేయాలని కోరింది. ప్రతిఏటా గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో అప్లికేషన్ అప్‌లోడ్‌ చేయాలి.

New Update
Padma Awards

Padma Awards Photograph: (Padma Awards)

వివిధ రంగాల్లో అత్యుతన్నత ప్రతిభ, విశేష కృషి కనబరిచిన వారికి ఇచ్చే పద్మ పురస్కారాలకు కేంద్ర దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇండియాలో పద్మ అవార్డ్స్ అత్యున్నత పురస్కారాలు. ప్రతిఏటా గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31 లోగా పద్మ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు, సిఫార్సులు చేయోచ్చు. అందుకోసం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో అప్లికేషన్ అప్‌లోడ్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

Also read: Starbucks : తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం

దేశంలోని రెండు అత్యున్నత పౌరపురస్కారాలైన భారతరత్న, పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 1954లో ప్రారంభించింది. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన వారికి సైతం అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. వివిధ రంగాల్ల ప్రతిష్ఠాత్మక, అసాధారణ సేవలు అందించినందుకు అవార్డులతో సత్కరిస్తుంది. ఈ అవార్డులను ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తుండగా.. మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు.

Also read: Pakistan terrorist : పాకిస్తాన్‌లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు