CBSCలో ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానం.. క్లారిటీ ఇచ్చిన బోర్డు

వచ్చే ఏడాది జరగనున్న 10,12 తరగతుల సీబీఎస్‌ఈ పరీక్షల్లో సిలబస్ తగ్గిస్తారని, ఓపెన్ బుక్ పరీక్షలు జరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి. దీనిపై స్పందించిన సీబీఎస్‌ఈ ఈ వార్తల్ని కొట్టిపారేసింది. తాము ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.

New Update
book

వచ్చే ఏడాది జరగనున్న 10,12 తరగతుల బోర్డు పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గిస్తారని, పలు సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహిస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు జరిగాయి. అయితే వీటిపై తాజాగా సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు స్పందించింది. ఈ వార్తలు అవాస్తవం అంటూ కొట్టిపారేసింది. ఇలాంటి ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించింది. వచ్చే ఏడాది జరగబోయే పరీక్షల్లో సీబీఎస్‌ఈ ఎలాంటి మార్పులు చేయలేదని ఓ ప్రకటనలో పేర్కొంది.  

Also Read: చెత్త వేస్తే చలానా.. ఫొటో తీసి మరీ పట్టుకుంటారు.. GHMC నయా యాప్ రెడీ!

2025 బోర్డు పరీక్షలకు సంబంధించి తాము అటువంటి నోటిఫికేషన్ ఏదీ కూడా విడుదల చేయలేదంటూ స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తమ అధికారిక వెబ్‌సైట్‌లోనే వివరిస్తామని పేర్కొంది. అందువల్ల ఇలాంటి తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచనలు చేసింది. 

Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!

ఇదిలాఉండగా.. 10,12వ తరగతి పరీక్షలకు సంబంధించిన డేట్‌షీట్లను మరికొన్ని రోజుల్లోనే సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేయనుంది. సాధారణంగా ప్రతీ సంవత్సరం నవంబర్ నాటికి ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. గత ట్రెండ్స్‌ను చూస్తే.. ఈసారి కూడా ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు