/rtv/media/media_files/2026/05/26/fotojet-11-2026-05-26-11-31-30.jpg)
సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల్లో తీవ్రమైన అవకతవకలు బయటపడ్డాయి. జవాబు పత్రాల మూల్యాంకనంలో బోర్డు అనుసరిస్తున్న డిజిటల్ విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ విద్యార్థికి ఎగ్జామ్‌లో తన పరీక్షా పత్రం కాకుండా వేరొకరిది వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!
CBSE student Vedant Srivastava cried foul over "incorrect" evaluation. Rahul Gandhi backed him. Now his brother pleads with the government.
— Dr.Barlin (@DrBarlin) May 25, 2026
One family's battle. A system on trial.#CBSE#FairExams
pic.twitter.com/N0JU3E3Nt3
బోర్డు తప్పిదం..
వేదాంత్ శ్రీవాస్తవ అనే విద్యార్థికి బోర్డు నిర్వహించిన ఫిజిక్స్ పరీక్షలో తన అంచనాకు భిన్నంగా తక్కువ మార్కులు రావడంతో షాక్ అయ్యాడు. దీంతో అసలేం జరిగిందని తెలుసుకోవాలని తన జవాబు పత్రాల ఫోటోకాపీలను కోరాడు. సీబీఎస్‌ఈ తన ఆన్‌లైన్ స్క్రిప్ట్ మానిటరింగ్ విధానం ద్వారా పంపిన ఫిజిక్స్ జవాబు పత్రాన్ని చూసి అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ పేపర్ ఆ విద్యార్థిని కాదు.. వేరొకరిది. బోర్డు చేసిన ఈ పొరపాటు వల్ల అతని మార్కులు పూర్తిగా మారిపోయాయి. భవిష్యత్తులో కాలేజీలో జాయిన్ అయ్యే విషయంలో కూడా ఇబ్బంది పడ్డాడు. వేదాంత్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో సీబీఎస్‌ఈ అధికారులు వెంటనే స్పందించారు. ఫిజిక్స్ జవాబు పత్రం విషయంలో జరిగిన తప్పును బోర్డు బహిరంగంగానే అంగీకరించింది. బోర్డు సంయుక్త కార్యదర్శి స్వయంగా వేదాంత్‌కు లేఖ రాశారు. మీ సరైన జవాబు పత్రం దొరికిందని.. దానిని యాడ్ చేస్తున్నామన్నారు.
ఇది కూడా చూడండి: Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)..... చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!
#WATCH | Delhi: On the controversy where a Class 12 CBSE student, Vedant’s Physics CBSE answer sheet was allegedly switched with another candidate's, the student's brother, Siddhant Srivastava, says, “The problem was that his answer sheet was exchanged with someone else's, and… pic.twitter.com/QoWroqqyYq
— ANI (@ANI) May 26, 2026
అయితే కేవలం ఫిజిక్స్ పరీక్షలోనే కాదు.. కెమిస్ట్రీ పేపర్ విషయంలో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయని మరొక విద్యార్థి సోషల్ మీడియాలో ఆరోపించాడు. తాను రాసిన సమాధానాలకు సరైన మార్కులు పడలేదని.. మూల్యాంకన ప్రక్రియలో లోపాలు ఉన్నాయని అతను ఫిర్యాదు చేశాడు. దీనిపై కూడా సీబీఎస్‌ఈ విచారణ జరిపింది. ఇలా వరుసగా విద్యార్థుల పరీక్షా పత్రంలో ఫిర్యాదులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
Follow Us