Toll plaza : టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేత.. ఇక ఇలా చెల్లించాల్సిందే

టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేస్తామని ప్రకటించిన కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఈ మేరకు కీలకనిర్ణయం తీసుకుంది. ముందు చెప్పినట్లు గానే టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేసింది. ఇక నుంచి కేవలం డిజిటల్‌ పేమెంట్లు మాత్రమే అనుమతించాలని ఆదేశించింది. 

New Update
FotoJet - 2026-02-09T191845.351

Cash payments at toll plazas have been stopped

Toll plaza : టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేస్తామని ప్రకటించిన కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ముందు చెప్పినట్లు గానే టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేసింది. ఇక నుంచి కేవలం డిజిటల్‌ పేమెంట్లు మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది.  వచ్చే ఏప్రిల్ 1 నుంచి డిజిటల్‌ పేమెంట్లను పూర్తి స్థాయిలో  అమలు చేయాలని కేంద్ర రవాణా శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. టోల్‌ప్లాజాల వద్ద అధిక రద్దీని తగ్గించడం, ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని ఆదాచేయడం, రుసుముల వసూళ్లలో పారదర్శకత ను పాటించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

నిజానికి గతంలోనే నగదు చెల్లింపులను తగ్గించి  ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ప్లాజా చెల్లింపులు చేస్తున్నప్పటికీ కొన్ని వాహనాలు అప్పటికప్పుడు నగదు చెల్లించి వెళ్తున్నారు. దీంతో నగదు చెల్లించడానికి అవసరమైన చిల్లర ఉండకపోవడం, చెల్లించడానికి సమయం పట్టడం వంటి కారణాలతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయంతో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పూర్తిస్థాయిలో నగదు రహిత చెల్లింపులతోనే టోల్‌ ప్లాజాలు నడుస్తాయి. కాగా నగదు చెల్లింపుల నిలిపివేత గడువు సమీపిస్తుండటంతో డిజిటల్‌ చెల్లింపులకు మారేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. ఫాస్టాగ్‌ లేదా యూపీఐ చెల్లింపుల విధానం వల్ల ప్రయాణాలు వేగవంతమవుతాయని తెలిపారు. అంతేకాక ఇంధనం ఆదా అవుతుంది. పారదర్శకత వస్తుంది. చిల్లర లేదా రశీదుల కోసం వేచి ఉండవలసిన అవసరం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.  

Advertisment
తాజా కథనాలు