/rtv/media/media_files/2026/04/21/indians-2026-04-21-12-39-55.jpg)
కెనడా వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ శాఖ ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. గతంతో పోలిస్తే ఇప్పుడు భారతీయుల వీసా అప్లికేషన్లు చాలా వేగంగా క్లియర్ అవుతున్నాయి. ఏప్రిల్ 15 వరకు ఉన్న తాజా వివరాల ప్రకారం.. ముఖ్యంగా విజిటర్ వీసాలు,స్టడీ పర్మిట్ల వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గింది.
ఒకప్పుడు భారతీయులకు విజిటర్ వీసా రావడానికి 37 రోజులు పట్టేది, కానీ ఇప్పుడు అది కేవలం 23 రోజుల్లోనే పూర్తవుతోంది. అదేవిధంగా కెనడాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కూడా ఊరట లభించింది. స్టడీ పర్మిట్ సమయం 4 వారాల నుండి 3 వారాలకు తగ్గడం వల్ల విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు కెనడా చేరుకోవడానికి అవకాశం ఏర్పడింది.
🚨 Indian students face heat as visa refusals soars in US, Austrialia; Canada’s new international study permits dropped 64% in 2025 (FE)
— Indian Info Lead 🇮🇳 (@Indianinfolead) April 21, 2026
New data shows:
👉 US visa rejection for Indians ~61%
👉 Australia refusals at a 20-year high
👉 Canada study permits down 64% in 2025… pic.twitter.com/lW8vVHakDq
భారతీయులకు స్వల్ప నిరాశ
కేవలం సాధారణ వీసాలే కాకుండా తల్లిదండ్రులు, తాతయ్య-నానమ్మల కోసం దరఖాస్తు చేసే సూపర్ వీసా ప్రాసెసింగ్‌లో కూడా కెనడా వేగం పెంచింది. గతంలో దీని కోసం 202 రోజులు వేచి చూడాల్సి రాగా, ఇప్పుడు ఆ సమయం 182 రోజులకు తగ్గింది. అయితే వర్క్ పర్మిట్ల విషయంలో మాత్రం భారతీయులకు స్వల్ప నిరాశ ఎదురైంది. గతంలో 7 వారాల్లో వచ్చే వర్క్ పర్మిట్ ఇప్పుడు 8 వారాలకు పెరిగింది. ఇదే సమయంలో అమెరికా నుండి అప్లై చేసే వారికి మాత్రం వర్క్ పర్మిట్ సమయం స్వల్పంగా తగ్గడం గమనార్హం.
మొత్తంగా చూస్తే కెనడా ఇమ్మిగ్రేషన్ శాఖ తన పనితీరును మెరుగుపరిచింది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ వంటి ఇతర దేశాల అప్లికేషన్లలో కూడా చిన్నపాటి మార్పులు జరిగినప్పటికీ, భారతీయులకు మాత్రం విజిటర్, స్టడీ వీసాల విషయంలో కెనడా పెద్ద పీట వేసింది. అప్లికేషన్ల సంఖ్య, అక్కడ ఉండే పని ఒత్తిడిని బట్టి ఈ రోజుల్లో అప్పుడప్పుడు మార్పులు రావొచ్చని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న వేగం కెనడా వెళ్లేవారికి పెద్ద ఊరటనిస్తోంది.
Follow Us