/rtv/media/media_files/2025/03/24/BPHzoa3Abr35HZJI8JYY.jpg)
_Bulldozer treatment Photograph: (_Bulldozer treatment )
నాగ్‌పూర్‌లో ఔరంగజేబు సమాధిని కూల్చాలని ర్యాలీగా వెళ్లిన వర్గంతో మరో వర్గం ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకొని హింసకు పాల్పడ్డారు. మార్చి 17న ఈ అల్లర్లు జరిగాయి. నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసకు ప్రధాన సూత్రధారి ఫహీమ్ షమీమ్ ఖాన్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. స్థానికంగా ఉన్న వారిని ఫహీమ్ షమీమ్ ఖాన్ రెచ్చగొడ్డి ఘర్షణకు తీసుకొచ్చారు. అతను ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇంటిని అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. కోర్టు అతనికి మార్చి 21 వరకు పోలీసు కస్టడీకి పంపింది. ప్రధాన నిందితుడు, 38 ఏళ్ల ఫహీమ్ షమీమ్ ఖాన్, ఈ అల్లర్లను ప్రేరేపించడానికి బాధ్యత వహించాడని పోలీసులు పేర్కొన్నారు. షమీమ్ నాగ్‌పూర్ మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ (MDP) అధ్యక్షుడు.
Also read: Rajahmundry Event anchor: అక్రమ సంబంధంలో అనుమానం.. తల్లీకూతుళ్లను పొడిచి చంపిన యువకుడు
#WATCH | Maharashtra: Police in Nagpur arrive at the residence of Nagpur violence accused Faheem Khan, with a bulldozer. pic.twitter.com/pJenvIVcZu
— ANI (@ANI) March 24, 2025
Bulldozer action begins against Nagpur violence accused Fahim Khan.
— Padmaja Joshi (@PadmajaJoshi) March 24, 2025
Parts of his house declared ‘unauthorised construction’ pic.twitter.com/K6BAsJnFoL
Also read: Eknath Shinde: ఏక్ నాథ్ షిండేపై జోక్స్.. కమీడియన్‌పై కేసు నమోదు
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫహీమ్ ఖాన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై పోటీ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఫహీమ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ద్వారా ఆ వర్గ ప్రజలను గొడవకు తీసుకువచ్చాడని తేలింది. ఆ తర్వాత నాగ్‌పూర్‌లో హింస చెలరేగిందని కూడా తేలింది. అతని పేరు కూడా FIRలో నమోదు చేశారు. ఫహీమ్ ఖాన్ నాగ్‌పూర్‌లోని సంజయ్ బాగ్ కాలనీ యశోధర నగర్ నివాసి.