/rtv/media/media_files/2026/04/21/mallareddy-2026-04-21-13-24-17.jpg)
మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు.ఆయన కొడుకు భద్రా రెడ్డి, కొడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధానిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకలగా కలిసి పలు కీలక విషయాలపై చర్చించారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్‌లో గూగుల్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద విద్యా సహకార ప్రాజెక్టు, భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ఏఐ-ఏజెన్సీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని మల్లారెడ్డి ఈ సందర్భంగా ఆహ్వానించారు.
లక్ష మందితో మల్లారెడ్డి క్యాంపస్‌లో
లక్ష మంది విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించబోయే ఈ భారీ కార్యక్రమం విద్యా రంగంలో ఒక విప్లవం కాబోతోందని మల్లారెడ్డి మోదీతో ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. భారత స్వాతంత్ర్యానికి గుర్తుగా 79,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, ఇతరులు కలిపి మొత్తం లక్ష మందితో మల్లారెడ్డి క్యాంపస్‌లో "150 ఏళ్ల వందేమాతరం" ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరై, ఆసియాలోనే అతిపెద్ద ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించాల్సిందిగా మోడీని కోరారు.
ప్రధాని మోదీకి తమ సంస్థల ద్వారా అందిస్తున్న ఉచిత సేవలను మల్లారెడ్డి వివరించారు. 3000 పడకల టీచింగ్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు, సిజేరియన్లు, ఆపరేషన్లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలన్నీ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. పుట్టిన శిశువులకు 5000 రూపాయల డీడీతో పాటు, నిత్యావసరాలతో కూడిన మల్లారెడ్డి కిట్ ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.
కాగా గత 23 ఏళ్లుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, మల్లారెడ్డి సంస్థలు ఒక భారీ విద్యా సామ్రాజ్యంగా ఎదిగాయి.
మూడు విశ్వవిద్యాలయాలు: ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అన్ని విభాగాల్లో కోర్సులు.
భారీ ఆసుపత్రులు: 3500 పడకల సామర్థ్యంతో నాలుగు ఆసుపత్రులు.
విశాలమైన నెట్‌వర్క్: 10,000 మందికి పైగా ఫ్యాకల్టీ, 60,000 మంది వృత్తి విద్యా విద్యార్థులు, 10,000 మంది స్కూల్ పిల్లలు.
వసతి సౌకర్యం: 10,000 మంది బాలికలు, 5,000 మంది బాలురు ఉండేలా అత్యాధునిక హాస్టల్స్.
Follow Us