/rtv/media/media_files/2025/02/08/ybkIcJ8S0iMVdyOMVY67.jpg)
cm ex cm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ అద్మీ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ అగ్ర నేతలందరూ దాదాపుగా ఓటమి అంచుల్లోనే ఉన్నారు. న్యూఢిల్లీ సీటు నుంచి పోటీ చేసిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 600 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. 9 రౌండ్ల కౌంటింగ్ ముగిసిన తర్వాత, బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ మంత్రి మనీష్ సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా 240 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి సీఎం అతిషిపై 3,231 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు, బీజేపీ 46 స్థానాల్లో, ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఖాతా తెరవడం లేదు.