మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ మూడో జాబితా విడుదల బీజేపీ సోమవారం 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితా విడుదల చేసింది. అలాగే నాందేడ్ లోక్‌సభ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఈ మూడో జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. By B Aravind 28 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికల్లో అధికార, విపక్ష పార్టీలు బిజీ అయిపోయాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశాయి. అయితే బీజేపీ సోమవారం 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితా విడుదల చేసింది. అలాగే నాందేడ్ లోక్‌సభ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించింది. అర్వీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత.. దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత సహాయకుడిగా గత కొన్నేళ్లుగా పనిచేసిన సుమిత్ వాంఖడేను బరిలోకి దింపారు. Also Read: దేశంలో జనగణన.. తెలంగాణ, ఏపీతో పాటు ఆ రాష్ట్రాలకు ఊహించని దెబ్బ ! బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. ముంబై వెస్ట్‌లోని వెర్సావా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భారతీ లవేకర్ బరిలోకి దిగనున్నారు. తూర్ సిటీ నుంచి అర్చన శైలేష్ పాటిల్ చకుర్కర్, పాల్ఘర్ జిల్లాలోని వాసాయి స్థానం నుంచి స్నేహ దుబే, వాషిమ్‌లోని కరంజా నుంచి సాయి ప్రకాష్ దహకేకు టికెట్లు దక్కాయి. మరోవైపు గత వారం బీజీపీ 99 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. శనివారం 22 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. మూడో జాబితాతో కలిపి ఇప్పటివరకు బీజేపీ 146 మంది అభ్యర్థులకు ప్రకటించింది. Also Read: డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు.. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక ఝార్ఖండ్‌లో 13, 20 తేదీల్లో రెండు విడుతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇటీవల హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగిన సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలపై కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. #telugu-news #maharastra #maharastra-assembly మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి