/rtv/media/media_files/b2HEtyVsxRPBye5zw9uN.jpg)
ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు ఎక్కువైపోయాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు పండు ముసలి వాళ్లను సైతం వదలడం లేదు. అయితే ఒక్క మనుషులనే కాదు.. జంతువులపై కూడా తమ కామ కోరికలు తీర్చుకుంటున్నారు. దీని బట్టి చూస్తే కామాంధులు ఎలా పెట్రేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో అత్యాచార ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కామాంధులు ఆగడం లేదు. మరింతగా రెచ్చిపోతున్నారు.
Also Read : గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 20 మంది మృతి..
చేతులు నరికేయండి
అయితే అమ్మాయిల భద్రత విషయంలో ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ అమ్మాయిలకు అండగా నిలిచాడు. ఎవరైనా దుర్మార్గులు అమ్మాయిలను తాకితే వారి చేతులు నరికేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఆ అమ్మాయిలకు కత్తులను పంపిణీ చేశాడు. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: యాంకర్ కావ్యశ్రీపై దాడి.. ఆ పార్టీ మాజీ ఎంపీ అనుచరుడే
బీహార్‌లోని సీతామర్హి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ విజయదశమి సందర్బంగా దుర్గా మాతకు పూజాలు చేశారు. అనంతరం పూజా మండపం వద్ద ఆయుధాలు, కత్తులు, గన్‌లకు ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ, స్కూల్ బాలికలు అక్కడే ఉండగా.. వారికి రామాయణం పుస్తకంతోపాటు కత్తులను పంపిణీ చేశారు. ఆపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎవరైనా దుర్మార్గుల సోదరీమణులను తాకడానికి ప్రయత్నిస్తే వెంటనే వారి చేతులను ఈ కత్తులతో నరకాలని పిలుపునిచ్చారు.
BJP MLA Mithilesh Kumar openly distributes swords & Ramayana in Bihar
— Hariprasad.B.K. (@HariprasadBK2) October 10, 2024
Had a Muslim MP/MLA done the same,they'd be slapped with UAPA,NSA & have their home bulldozed
Hypocrisy is glaring
Is this the justice we stand for
Why no action despite lawmaker openly advocating violence pic.twitter.com/tHJ9zxqKHM
Also Read : బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
ప్రజలు మద్దతు ఇవ్వాలి
కాగా ఆ దుర్మార్గుల చేతులు నరికే సామర్థ్యం మన సోదరీమణులు కలిగి ఉండాలి. అయితే ఇదంతా అందరూ కలిసి కట్టుగా చేయాలన్నారు. సోదరీమణులపై చెడు ఉద్దేశం ఉన్న దుర్మార్గులందర్నీ నాశనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నానికి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే తీరుపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
Also Read : టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి.. దీని వెనుక సజ్జల హస్తం ఉందా?