/rtv/media/media_files/2026/04/14/samrat-choudhary-2026-04-14-16-22-31.jpg)
బీహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కింగ్ మేకర్‌గా ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు నేరుగా సింహాసనాన్ని దక్కించుకుంది. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. దీనితో బీహార్‌లో అత్యున్నత పదవిని అధిష్టించిన తొలి బీజేపీ నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. నితీశ్ కుమార్ ఈరోజు (ఏప్రిల్ 14) సీఎం పదవికి రాజీనామా చేశారు. తర్వాత బీజేపీ రాష్ట్రనాయకులు సమావేశమై ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ప్రతిపాధించారు. గత కొన్ని నెలల నుంచి ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నా.. బీజేపీ అనూహ్యంగా సామ్రాట్‌ను బీహార్ సీఎంగా చేసింది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానంద్ రాయ్ పేరు కూడా బలంగా వినిపించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్ల ఆ వర్గం ఓట్లను ఆకర్షించేందుకు ఈయన్ని ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అలాగే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న దిలీప్ జైస్వాల్ పేరు కూడా ఊహించని విధంగా తెరపైకి వచ్చింది. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయాలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి లేదా కీలక పదవి చేపడతారని కొన్ని ఊహాగానాలు వచ్చాయి, కానీ నితీష్ కుమార్ వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండటంతో అది చర్చలకే పరిమితమైంది. జేడీ(యూ) నుండి ఒకవేళ ఎంపిక చేయాల్సి వస్తే, నితీష్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ కుమార్ చౌదరి పేరు వినిపించింది.
Samrat Chowdhary is the new CM of Bihar. Name proposed by Vijay Sinha.
— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) April 14, 2026
BJP को बिहार में पहला CM मिला, कल सम्राट चौधरी लेंगे शपथ #Bihar
pic.twitter.com/gZiymHQ3YV
కుల సమీకరణాలే కీలకం
57 ఏళ్ల సమ్రాట్ చౌదరి రాష్ట్రంలోని వెనుకబడిన తరగతి (OBC) వర్గమైన కోయిరి (కుష్వాహా) కులానికి చెందినవారు. బీహార్ జనాభాలో యాదవుల తర్వాత అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన వర్గం ఇదే కావడం గమనార్హం. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ), కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన నేతనే ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీకి సూచించినట్లు సమాచారం. ఈ వ్యూహాత్మక నిర్ణయం ద్వారా అటు ఓబీసీ ఓటు బ్యాంకును పదిలపరుచుకోవడంతో పాటు, ఇటు పాలనలో కొత్త మార్పును తీసుకురావాలని కూటమి భావిస్తోంది.
243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం పార్టీల బలాబలాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీ: 89 మంది ఎమ్మెల్యేలు, జేడీ(యూ): 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
2005 నుంచి రాష్ట్రంలో నితీష్ కుమార్‌తో పొత్తులో ఉన్న బీజేపీ, ఇప్పటి వరకు ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదు. కేవలం ఉప ముఖ్యమంత్రి పదవులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సమ్రాట్ చౌదరి రూపంలో ఒక శక్తివంతమైన ఓబీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించడంతో బిహార్‌లో బీజేపీ తన సొంత అధికారాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
Follow Us