Bihar : కూలీ పనులు చేసి భార్యను చదివిస్తే.. ఉద్యోగం రాగానే రంకుమొగుడితో దొరికిపోయింది!

పాపం భార్యను కష్టపడి చదివించాడు. అంతేకాకుండా ఉన్నదంతా ఊడ్చి చేతిలో పెట్టాడు. తీరా ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఆ భార్య .. తన భర్తను, పదేళ్ల కొడుకును నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయింది.

New Update
husband

పాపం భార్యను కష్టపడి చదివించాడు. అంతేకాకుండా ఉన్నదంతా ఊడ్చి చేతిలో పెట్టాడు. తీరా ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఆ భార్య .. తన భర్తను, పదేళ్ల కొడుకును నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయింది. బీహార్‌లోని హాజీపూర్‌లో వెలుగుచూసిన ఈ హృదయవిదారక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భార్యను ఉన్నత చదువులు చదివించడానికి ఆ భర్త చేసిన త్యాగం, చివరకు ఆమె చేసిన మోసం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఇంతకు ఏం జరిగిందంటే.. 

బాధితుడు అమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో అతనికి గుంజన్ కుమారితో వివాహం జరిగింది. పెళ్లయ్యేనాటికి ఆమె కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకుంది. టీచర్ అవ్వాలనేది ఆమె కల. కుటుంబంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, భార్య కలను నిజం చేయాలని అమన్ అనుకున్నాడు. తను రెక్కల కష్టం చేస్తూ, కూలీ పనులకు వెళ్తూ భార్య చదువుకు, ఇంటి ఖర్చులకు డబ్బులు సమకూర్చేవాడు. అంతటితో ఆగకుండా, ఆమె గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేయడానికి, అలాగే బీపీఎస్సీ కోచింగ్ ఫీజుల కోసం 2022లో తనకున్న ఒకటిన్నర కత్తాల సొంత భూమిని కూడా అమ్మేశాడు.

భర్త ఆశించినట్టే గుంజన్ కుమారి కష్టపడి చదివి ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. క్లాస్ 6 నుండి 8 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. అయితే, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు మొదలైంది. శిక్షణ కాలంలో సుపాల్ జిల్లాలో ఉన్నప్పుడు, అదే రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన మరో ఉపాధ్యాయుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. 

దీంతో ప్రియుడిని విడిచి ఉండలేకపోయింది గుంజన్. గత ఏడాది కాలంగా తన భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది. 2025 జనవరిలో, తను తోటి ఉపాధ్యాయులతో కలిసి డార్జిలింగ్ ట్రిప్‌కు వెళ్తున్నానని అబద్ధం చెప్పి, తన పదేళ్ల కొడుకును భర్త దగ్గరకు పంపించేసింది. అయితే, అసలు అలాంటి ట్రిప్ ఏదీ జరగలేదని అమన్‌కు తర్వాత తెలిసింది. దీంతో అతనిలో అనుమానం బలపడింది.

చివరకు మే 23న హాజీపూర్‌లోని లిచ్చావి నగర్ ప్రాంతంలో గుంజన్ అద్దెకు ఉంటున్న ఇంటికి అమన్ వెళ్లాడు. అక్కడ తన భార్య, ఆ ఉపాధ్యాయుడితో కలిసి అభ్యంతరకర స్థితిలో ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. కట్టుకున్న భార్య ఇలాంటి మోసానికి ఒడిగట్టడంతో ఏం చేయాలో పాలుపోక ఆ భర్త లబోదిబోమంటున్నాడు. ఈ మోసం గురించి తెలిసిన నెటిజన్లు ఆ భార్య ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు