/rtv/media/media_files/2025/03/10/juZS32bHUE5S6KIaaWwc.jpg)
Bangalore Gold Smuggling Case
Bangalore Gold Smuggling Case : కన్నడ నటి రన్యారావు బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. సోమవారం ప్రముఖ వ్యాపారవేత్త తరుణ్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రన్యారావు నుంచి స్మగ్లింగ్ బంగారం కొనుగోలు చేసి..తరుణ్ రాజ్ జ్యువెల్లరీ, హోటల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రన్యారావు కాల్ డేటా ఆధారంగా తరుణ్ రాజ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, అంతకుముందు రన్యారావును డీఆర్ఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రన్యారావు డీఆర్‌ఐ అధికారులపై ఫిర్యాదు చేస్తూ ‘నన్ను డీఆర్ఐ అధికారులు వేధిస్తున్నారు’ అంటూ జడ్జి ఎదుట విలపించారు. విచారణ అనంతరం ఆమెకు మరో 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది.
Also Read : ఇది అసాధారణ మ్యాచ్..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు!
కాగా, దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగిన రన్యారావును గత సోమవారం రాత్రి డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 14.2 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాను తరచూ దుబాయ్, అమెరికా సహా పలు దేశాలకు వెళ్లేదాన్నని డీఆర్ఏ విచారణలో రన్యారావు అంగీకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో రన్యారావు వెనుక అక్రమ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఏదైనా ఉందా అనే కోణం నుంచి ప్రస్తుతం డీఆర్ఐ ఆరా తీస్తోంది.
Also Read : ఏలూరులో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే 30 మంది!
అసెంబ్లీలో దుమారం
మరోవైపు నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసు విషయంలో కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. ఆమె అరెస్టు వెనుక ఒక మంత్రి ఉన్నారని బీజేపీ ఆరోపించగా, హోం మంత్రి పరమేశ్వర్ తమకు సమాచారం లేదని అన్నారు. ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వం ఎవరినో రక్షిస్తోందని ఆరోపించింది. ఈ అంశంపై కర్ణాటక అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగింది. అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు వెనుక ఉన్న మంత్రి ఎవరు అనే విషయంపై తీవ్ర కలకలం రేగింది. ఆమె వెనుక ఉన్నది ఎవరో బహిర్గతం చేయాలంటూ సభలోని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో కొద్ది సేపు తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఈ కేసు గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని హోంమంత్రి చెప్పడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నటి రన్యా రావు కేసుకు సంబంధించి, బంగారం స్మగ్లింగ్ వెనుక ఉన్న మంత్రి ఎవరు? అని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సభలో ప్రశ్న లేవనెత్తారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. హోంమంత్రి పరమేశ్వర తనకు తెలియదని చెప్పడంతో ఒక్కసారిగా సభలో వివాదం చెలరేగింది.
Also Read : వైద్యురాలితో అసభ్య ప్రవర్తన.. తమ్మయ్య బాబును సస్పెండ్ చేసిన జనసేనాని!
అయితే సభలో మంత్రి ఎవరో చెప్పకపోయినా.. బంగారం అక్రమ రవాణా వెనుక బడా నేత ఉన్నట్లు సమాచారం. ఆదివారం ఈ కేసు వెనుక మంత్రి ఉన్నారని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం కూడా ఇదే అంశం సభలో లేవనెత్తడంతో గందరగోళం చోటు చేసుకుంది. అసెంబ్లీ జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన కర్కల బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, బంగారం అక్రమ రవాణాకు పోలీసులే ప్రోటోకాల్ ఇచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక మంత్రి ఎవరో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. దీనిపై హోంమంత్రి పరమేశ్వర్ స్పందిస్తూ.. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని అన్నారు.
Also read: MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
ఈ కేసు గురించి మీకు ఎంత తెలుసో, తనకూ అంతే తెలుసని అన్నారు. ఆ మంత్రి ఎవరో సీబీఐ కనుక్కోవాలని ఆయన అన్నారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని సునీల్ కుమార్ దీన్ని మీరే సీబీఐకి ఇవ్వండి అని డిమాండ్ చేశారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి వెల్లడించారు. కానీ, బీజేపీ ఎమ్మెల్యే మాత్రం.. ఎవరినో రక్షించడానికి ఇదంతా జరుగుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. స్పీకర్ ఖాదర్ జోక్యం చేసుకుని కేసు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
Also Read : నీ కోసం జీవితాంతం ఎదురు చూస్తానని.. యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్