PM Narendra Modi : మోదీకి పిడుగులాంటి వార్త!

దేశంలో రాజకీయంగా బీజేపీ బలంగా కనిపిస్తోంది.  మోదీ ఇమేజ్ ఇంకా స్ట్రాంగ్‌ అవుతూనే ఉంది.   ఎన్నికల్లో వరుస విజయాలు వస్తూనే ఉన్నాయి.  కానీ,  ముగ్గురు ప్రముఖులు మోదీ ప్రభుత్వానికి, భారత ఆర్థిక వ్యవస్థకు అబ్ నార్మల్ వార్నింగ్స్  ఇస్తున్నారు.

New Update
modi ravi

-Ravi Prakash

Ravi Prakash

దేశంలో రాజకీయంగా బీజేపీ బలంగా కనిపిస్తోంది.  మోదీ ఇమేజ్ ఇంకా స్ట్రాంగ్‌ అవుతూనే ఉంది.   ఎన్నికల్లో వరుస విజయాలు వస్తూనే ఉన్నాయి.  కానీ,  ముగ్గురు ప్రముఖులు మోదీ ప్రభుత్వానికి, భారత ఆర్థిక వ్యవస్థకు అబ్ నార్మల్ వార్నింగ్స్  ఇస్తున్నారు.  వీళ్లు, విపక్ష నేతలు కాదు.. కాంగ్రెస్‌ నాయకులు కాదు.. లెఫ్ట్‌ లీడర్స్‌ కూడా కాదు. మోదీ యుగంలో కీలక పాత్ర పోషించిన వాళ్లే ఇప్పుడు ఎకానమీ సైరన్‌  మోగిస్తున్నారు. 

వాళ్లలో ఒకరు మోదీ ప్రభుత్వ మాజీ చీఫ్ ఎకానామిక్ అడ్వాయిజర్  మరొకరు,  మోదీ ప్రభుత్వమే IMF కి పంపిన ప్రతినిధి.  మూడో వ్యక్తి, మన్మోహన్ సింగ్ వీక్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అని, మోదీ డిసైసివ్ లీడర్ అనే నారేటివ్‌ని బలపరిచిన వ్యక్తి. ఈ ముగ్గురూ ఇప్పుడు ఒక్కటే చెబుతున్నారు. ఇండియా ఎకానమీ లోపల ఏదో సీరియస్‌గా తప్పు జరుగుతోందని.. అసలు ఏం జరుగుతోంది?  ఇండియా నిజంగానే క్రైసిస్‌ వైపు  వెళ్తోందా?  రూపాయి ఎందుకు ఇంత డౌన్‌ అవుతోంది?  ఇన్వెస్టర్లు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? పొలిటికల్‌గా అత్యంత బలమైన ప్రభుత్వం, ఆర్థికంగా ఎందుకు బలహీనపడుతోంది? డీటైల్డ్‌గా చూద్దాం. ఇది,  స్టాక్ మార్కెట్ గురించికాదు. ఒక నమ్మకం గురించి, ఇన్వెస్ట్‌మెంట్‌ గురించి, గవర్నెన్స్ గురించి,  ఇండియా ఎకానమీ లోపల పెరుగుతున్న సైలెంట్ ఫియర్ గురించి చెప్పబోతున్నాను. 

ముందుగా, ఇండియా ఎకానమీకి వార్నింగ్‌ ఇచ్చిన ఆ ముగ్గురి గురించి తెలుసుకుందాం.  అరవింద్ సుబ్రమణియన్.  2014 నుంచి 2018 వరకు,  మోదీ ప్రభుత్వ చీఫ్ ఎకానామిక్ అడ్వాయిజర్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆర్థిక నిపుణుడు.  IMF, పీటర్సన్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థల్లో పనిచేశారు.  ఈయన అస్సలు ప్రభుత్వ వ్యతిరేకి కాదు.   రెండో వ్యక్తి,  సుర్జిత్ భల్లా.  ఈయన్ను మోదీ ప్రభుత్వమే IMF కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పంపింది.  చాలా సంవత్సరాలుగా, మార్కెట్ రిఫార్మ్స్ కి అండగా నిలిచిన ఆర్థికవేత్త.

మూడో వ్యక్తి,  సంజయ బారు. మన్మోహన్ సింగ్ మాజీ  మీడియా అడ్వైజర్.ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ రచయిత.   బీజేపీ  అనుచరులు ఎన్నో సంవత్సరాలు ఈ పుస్తకాన్ని అడ్డుపెట్టుకుని మన్మోహన్ సింగ్  వీక్‌ లీడర్‌, మోదీ స్ట్రాంగ్‌ లీడర్‌ అని ప్రచారం చేశారు. ఇప్పుడు, ఈ ముగ్గురే  ఇండియా ఎకానమీపై సీరియస్ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అదే ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న బిగ్‌ డిబేట్‌.  సుర్జిత్ భల్లా ఒక ఆర్టికల్‌ రాశారు.  దాని హెడ్‌లైన్ ఏంటంటే బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోంది, కానీ ఎకానమీని కోల్పోతోందా? ఇది చాలా పెద్ద పొలిటికల్‌ కామెంట్‌.. రాజకీయ విజయం ఆర్థిక మార్పుగా మారడం లేదని.  GDP నంబర్లు మాత్రమే చూసి, ఎకానమీ బలంగా ఉందని అనుకోవద్దని చెబుతున్నారు. 

భారత్ తన ఒరిజినల్‌ స్టామినాకు తగినట్లుగా ఎక్స్‌పోజ్‌ అవ్వడంలేదని  హెచ్చరిస్తున్నారు. బ్యాండ్-ఎయిడ్ ఆఫ్ సర్జరీ ..  అంటే, లోతైన సంస్కరణలకు బదులు, టెంపరరీ ప్యాచ్‌ వర్క్‌ జరుగుతోందని భల్లా అంటున్నారు.  అసలు సమస్య ఏమిటంటే, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్.  ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్.  దీర్ఘకాల నమ్మకం కావాలని ఇప్పుడు బిజినెస్‌ పీపుల్‌ అడుగుతున్నారు.   పాలసీలు స్థిరంగా ఉంటాయా?  టాక్స్ విధానం అకస్మాత్తుగా మారుతుందా?  రూల్స్ ఒక్కసారిగా మారిపోతాయా? ఉన్నట్లుండి ప్రభుత్వం ఊహించని నిర్ణయాలు తీసుకుంటుందా?  భల్లా చెప్పిందాన్ని బట్టి బిజినెస్‌ వర్గాల్లో మోదీ ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోంది.  

ఇక అరవింద్‌ సుబ్రమణియన్‌ రాసిన ఆర్టికల్‌ అయితే మరింత షార్ప్‌గా ఉంది. హెడ్‌లైన్ కూడా షాక్‌ కొట్టేలా ఉంది.  నీడెడ్ ఇన్ ఢిల్లీ :  చేంజ్ ఆఫ్ పర్సనెల్ నాట్ జస్ట్ పాలసీ. ఇదే ఇప్పుడు పారిశ్రామిక వేత్తలను టెన్షన్‌ పెడుతోంది. పాలసీలు మార్చితే సరిపోదు.  వ్యవస్థలో ఉన్న వ్యక్తుల ఆలోచనా విధానం కూడా మారాలని చెబుతున్నారు.  ఇండియాలో ఇప్పుడు క్లియర్ ఫైనాన్షియల్ డైరెక్షన్ లేదని తేల్చిపడేశారు.  డ్రిఫ్ట్,యూనివర్సటి, డైరెక్షన్ లేకపోవడమే పెద్ద ప్రాబ్లమ్స్‌ అని క్లియర్‌గా చెప్పేశారు.  ఇంకో మెయిన్‌ పాయింట్‌ ఏంటంటే రూపాయి డౌన్‌ అవ్వడానికి అంతర్జాతీయ వ్యవహారాలు  కారణమే కాదంటున్నారు.  అరవింద్‌ చెబుతున్నదాన్ని బట్టి,  ఇన్వెస్టర్లు ఇప్పుడు ఇండియా మిడయం గ్రోత్  పైనే  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, సేమ్‌ టైమ్‌ భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లు నమ్మకాన్ని కోల్పోతున్నారని కూడా చెప్పారు.   ఇది చాలా సీరియస్ స్టేట్‌మెంట్.  ఎందుకంటే,  ఒక చీఫ్ ఎకానామిక్ అడ్వాయిజర్ ఇలా అన్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. 

ఇండియాలో మెయిన్‌ ప్రాబ్లమ్‌ వీక్ ప్రైవేటు ఇన్వస్ట్ మెంట్. అంటే, ప్రైవేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం తగ్గిపోతోందని. ఇది ఎప్పటికైనా ప్రమాదే.. ఎందుకంటే,  ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వల్లే, ఫ్యాక్టరీలు వస్తాయి. ఎంప్లాయ్‌మెంట్‌ పెరుగుతుంది.  మ్యాన్యుఫాక్చరింగ్ పెరుగుతుంది, లాగ్ టర్మ్ గ్రోత్  ఉంటుంది. అదే పారిశ్రామిక వేత్తలు భయపడితే ఇన్వెస్ట్‌మెంట్‌ తగ్గిపోతుంది. ప్రస్తుతం అదే జరుగుతోందని సుబ్రమణియన్‌ హెచ్చరిస్తున్నారు.  

ఏ కంపెనీ టార్గెట్‌ అవుతుందో?

ఇక మూడో వ్యక్తి  సంజయ్‌ బారు మాత్రం ఎకానమీతో పాటు, పొలిటికల్ సైకాలజీ  గురించి మాట్లాడారు.   సమస్య కేవలం ఆర్థిక విధానాల్లో లేదు, ఫియర్,  అనిశ్చితి కేంద్రీకరణ ఇవే ఎకానమీపై ఎఫెక్ట్‌ చూపిస్తున్నాయని సంజయ్‌ చెబుతున్నారు. డీమోనిటైజేషన్ , కోవిడ్, లాక్ డౌన్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ పాలసీ షాక్, హై కాన్సంట్రేషన్ లాంటివి బిజినెస్‌ వర్గాల్లో ఎన్నడూ లేని భయాన్ని పెంచాయంటున్నారు.  రేపు ఏ కొత్త నిర్ణయం వస్తుందో? ఏ రూల్‌ మారుతుందో?  ఏ కంపెనీ టార్గెట్‌ అవుతుందో? అన్న డైలమా ఉన్నప్పుడు ఎవరూ రిస్క్‌ తీసుకుని ఇన్వెస్ట్‌ చేయరంటున్నారు.  

ఏదైనా నమ్మకం మీదే నడుస్తుంది.  ఇన్వెస్టర్స్‌కు కాన్ఫిడెన్స్‌ కలిగినప్పుడే పెట్టుబడి పెడతారు. అప్పుుడు ఎకానమీ స్పీడ్‌గా పెరుగుతుంది. కానీ భయం పెరిగితే ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆగిపోతాయి.  అప్పుడు ఎకానమీ  బయటికి స్ట్రాంగ్‌గా కనిపించినా, ఇంటర్నల్‌గా డౌన్‌ అవుతూనే ఉంటుంది.  

మరో కీ పాయింట్‌ ఏంటంటే, ప్రపంచం ఇప్పుడు చైనాపై డిపెండ్‌ అవడాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.  సప్లై చైన్ షిఫ్ట్ అవుతున్నాయి. అన్ని దేశాలకు మరో మ్యానుఫ్యాక్చరింగ్ జెయింట్  కావాలి. ఇలాంటప్పుడే అందరిచూపు ఇండియాపై పడింది. భారీ జనాభా. యువత ఎక్కువగా ఉండటం. పెద్ద మార్కెట్‌, జియోపొలిటికల్ ఇంపార్టెన్స్ అన్నీ మన దేశంలో ఉన్నాయి. ఈ అవకాశాలను ఇండియా యూస్ చేసుకోలేకపోతోందని ఎకనామిస్ట్ భావిస్తున్నారు.  ఎందుకంటే,  మ్యాన్యుఫాక్చరింగ్ ఆశించినంతగా పెరగలేదు.  ఉద్యోగాలు భారీ స్థాయిలో రావడం లేదు.  ఇవే మోదీ ప్రభుత్వాన్ని టెన్షన్‌ పెడుతున్నాయి.   ఇదే ఇప్పుడు ది గ్రేటెస్ట్ పారడాక్స్.  పొలిటికల్‌గా మోదీ ప్రభుత్వం సూపర్‌ స్ట్రాంగ్‌. బట్‌ ఇన్‌సైడర్లు చెబుతున్నది మాత్రం ఎకానమీ లోపల హై టెన్షన్‌ పెరుగుతోందని! దీన్నుంచి ఎలా బయటపడాలన్నదే భారత ఆర్థిక వేత్తలు ఆలోచిస్తున్నారు. 

ఈ మూడు ఆర్టికల్స్ కేవలం ఎకానమీ గురించి కాదు.  భారత్ భవిష్యత్తు గురించి.  ఎందుకంటే, నమ్మకం లేని వ్యాపారం ఎవరూ చేయరు.  అలాంటి నమ్మకాన్ని కోల్పోయాక ఇండియా గ్లోబల్ సూపర్ పవర్ ఎలా అవుతుందంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్   ఇండియా ఆర్థిక పునాదులు నిజంగా బలపడుతున్నాయా?  లేక, రాజకీయంగా మాత్రమే బలంగా కనిపిస్తున్నాయా?  చరిత్ర చెబుతున్న ఒక నిజం ఏమిటంటే, కొంతకాలం వరకు పొలిటికల్ పాపులారిటీ ఆర్థిక బలహీనతను దాచిపెట్టగలదు.  కానీ, నమ్మకం పోతే మాత్రం ఇన్వెస్టర్లు అస్సలు పెట్టుబడి పెట్టరు.  అదే జరిగితే ఏ దేశం కూడా ఆర్థికంగా ఎదగలేదు.   అందుకే, కేవలం ఒక వారంలోనే, భారత ఆర్థిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎక్స్‌ట్రార్డినరీ వార్నింగ్స్ ఇస్తున్నారు. దీనర్థం ఇండియా నాశనం అవుతుందని కాదు.  ఇండియా తన స్టామినా కంటే తక్కువ స్థాయికి పడిపోతుందేమోననే భయం వల్ల.. వీళ్లు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు