ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరో ఐదు రోజుల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖలు పంపారు. రాజీమామా చేసిన వారిలో పాలెం ఎమ్మెల్యేలు భావనా గౌర్, జనక్‌పురి ఎమ్మెల్యే రాజేశ్ రిషి, కస్తూర్బానగర్ ఎమ్మెల్యే మదన్‌లాల్, త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ మెహ్రౌలియా, ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేశ్, బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్ ఉన్నారు.
Aam Aadmi Party MLA from Trilokpuri Rohit Mehraulia, MLA from Kasturba Nagar Madan Lal, MLA from Janakpuri Rajesh Rishi, MLA from Palam Bhavna Gaur resigned from the party
— ANI (@ANI) January 31, 2025
The party did not give tickets to them this time.#DelhiElection2025 pic.twitter.com/tlrl2tdmNx
Also Read: కుంభమేళాలో అరాచకం.. ఆహారం వండుతున్న పాత్రలో మట్టి పోసిన పోలీస్
ఆప్ పట్ల విశ్వాసం కోల్పోయామని అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని.. తమ రాజీనామాను ఆమోదించండని కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. అయితే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ రాజీనామా చేసిన వారిలో ఎవ్వరికీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఈ కారణంతోనే వాళ్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Also Read: ఆఫీసులో పనిగంటలపై ఆర్థిక సర్వే సంచలన విషయాలు
ఇదిలాఉండగా.. మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్ ప్రచారాల్లో మునిగిపోయింది. ఓటర్లకు హామీల వర్షాలు కురిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆప్ నుంచి తాజాగా ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.