లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఏడుగురు షూటర్లు అరెస్టు..

ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో కాల్పులు జరిపిన వారి ఆచుకీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సంబంధించి వీరిపై విచారణ చేయనున్నారు.

New Update
Bishnoi

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. కాల్పులు జరిపిన వారి ఆచుకీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు షూటర్లను పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వారి నుంచి వివిధ రకాల ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అరెస్టయిన షూటర్లలో బాబా సిద్ధిఖీ హత్య కేసులో వీళ్లకు ఏమైనా సంబంధం ఉందా అనేదానిపై విచారణ కొనసాగనుంది.

Also Read: గుడ్‌న్యూస్.. దీపావళి పండగకు 6 రోజులు సెలవులు

అరెస్టయిన నిందితుల నుంచి ఆరు సెమీ ఆటోమెటిక్ పిస్టల్స్, 24 కాట్రిడ్జెస్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులు తాము టార్గె్ట్ పెట్టుకున్న వాహనాలను అనుసరించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాన్ని కూడా వినియోగిస్తున్నారు. రాజస్థాన్‌లో మాజీ ఎమ్మెల్యే కొడుకు సునిల్ పహిల్వాన్‌ తర్వాతి టార్గెట్ అని తెలుస్తోంది. ఈ నిందుతులను విచారణ చేసే సమయంలో బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన సమాచారం దొరుకుతుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటీవల రాజస్థాన్‌లో రెక్కీ నిర్వహించిన బిహార్‌ వాసి రితేష్‌ను కూడా తాము ట్రాక్ చేస్తున్నామని పేర్కొన్నారు. 

బాబా సిద్ధిఖీ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్‌ ఓ నిందితుడిని విచారించగా.. కాల్పులు జరిపిన వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణయ్‌తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నట్లు బయటపడింది. హత్యకు ముందు నిందితులు అన్మోల్ బిష్ణోయ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేసింది. 

Also Read: టూత్ పేస్ట్ కొంటే ఉద్యోగం ఊస్ట్.. ఎంప్లాయీస్ కు మెటా ఊహించని షాక్!

మరోవైపు అన్మోల్ బిష్ణోయ్‌పై ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో కూడా ఇతడు నిందితుడిగా ఉన్నాడు. 2023లో ఎన్‌ఐఏ అతనిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. అయితే అతడు ఫేక్ పాస్‌పోర్టుతో భారత్‌ నుంచి విదేశాలకు పారిపోయనట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు అతడు లొకేషన్లు కూడా మారుస్తుంటాడు. గతేడాది కెన్యాలో కనిపించగా.. ఈ ఏడాది కెనడాలో కనిపించాడు. ఇప్పటివరకు అన్మోల్ బిష్ణోయ్‌పై 18 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గతంలో అతడు జోధ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవించి.. 2021 అక్టోబర్ 7న బెయిల్‌పై విడుదలయ్యాడు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు