కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర కార్మిక శాఖ మంత్రికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మాండవీయ అతి త్వరలో ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. By srinivas 21 Oct 2024 | నవీకరించబడింది పై 21 Oct 2024 23:23 IST in నేషనల్ కరీంనగర్ New Update షేర్ చేయండి Bandi sanjay: కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కోరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. సోమవారం న్యూఢిల్లీలో మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్.. కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఇది కూడా చదవండి: రాష్ట్రంలో బాణాసంచా నిషేధం.. గోదాంలు సీల్ చేయాంటూ హైకోర్టు ఆదేశాలు! మెడికల్ హబ్ గా కరీంనగర్.. కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్ గా మారిందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్ కు విచ్చేస్తున్నారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు, నేత కార్మికులుసహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయడంవల్ల తమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. బండి సంజయ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ అతి త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ప్రియురాలికోసం.. కరణ్ జోహర్‌కు భారీ ఆఫర్ ఇచ్చిన సుఖేశ్! #hospital #Bandi Sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి