/rtv/media/media_files/2025/01/29/m7Fmc1H1H1pxXc6MXzyJ.jpg)
Narayanpur
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. నారాయణపూర్‌లో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 22 మంది పురుషులు, 07 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు, ఈ నక్సలైట్లంతా కుతుల్ ఏరియా కమిటీ సభ్యులు. వీరు ఈ ప్రాంతంలో నక్సలైట్ల కోసం చురుకుగా పనిచేస్తున్నారు.
16th April : 29 Maoists were sanitized by PM Modi Govt in Chhattisgarh's Kanker
— Karthik Reddy (@bykarthikreddy) April 25, 2024
8 days later : 18 Maoists surrender in Chattisgarh's Dantewada. pic.twitter.com/hpSdYF9jdW
ఇంత పెద్ద స్థాయిలో మావోయిస్టులు లొంగిపోవడం పెద్ద షాకనే చెప్పాలి. ఇంత పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోవడానికి మాద్, నారాయణపూర్ జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులే ప్రధాన కారణమని.. శరవేగంగా నిర్మించిన రోడ్లు, గ్రామాలకు చేరుతున్న వివిధ సౌకర్యాలు వారిని ప్రభావితం చేశాయని నారాయణపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రభాత్ కుమార్ చెబుతున్నారు.
లొంగిపోయిన నక్సలైట్లందరికీ రూ.25,000 ప్రోత్సాహక చెక్కును అందజేసి నక్సల్ నిర్మూలన విధానంలో వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దీంతో జిల్లాలో 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 71 మంది సీనియర్, కిందిస్థాయి మావోయిస్టులు లొంగిపోయారని.. అదే సమయంలో 60 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందగా, 50 మందిని అరెస్టు చేసినట్లు నారాయణపూర్ ఎస్పీ తెలిపారు.
మరోవైపు జార్ఖండ్‌లోని చైబాసా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా కేడర్‌తో సహా ఇద్దరు నక్సల్స్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులను జోనల్ కమాండర్ సంజయ్ గంఝూ, ఏరియా కమాండర్ హేమంతి, అనల్ గా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 10 రోజుల్లో హత్యకు గురైన రెండో మహిళా నక్సలైట్ క్యాడర్ హేమంతి. అంతకుముందు జనవరి 22న బొకారోలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏరియా కమాండర్ శాంతి చనిపోయారు.