Kejriwal: కేజ్రీవాల్ పై దాడి..వారి పనేనా అని అనుమానాలు!

కేజ్రీవాల్‌ ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సహా మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

New Update
delhi

Attack On Kejriwal:బీజేపీ పై ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై కొందరు దాడికి ప్రయత్నించినట్లు...ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్‌ ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు దుండగులు  దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సహా మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

Also Read:  ఇజ్రాయెల్‌ ప్యాంట్‌ తడిసిపోతుందిగా.. కారణం ఇదే!

ఈడీ, సీబీఐ, తీహార్ జైలులను ఉపయోగించుకుని.. కేజ్రీవాల్‌ను, ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రత్యక్షంగా దాడికి దిగిందని మండిపడ్డారు. ఢిల్లీలోని వికాస్‌పురిలో అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తుండగా.. కొందరు ఆయన దగ్గరికి వచ్చారని.. దాడి చేసేందుకు యత్నించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.  

Also Read:  జగన్‌ బెయిల్‌ రద్దు..? అన్నాచెల్లెలి ఆస్తుల వివాదంలో టర్నింగ్ పాయింట్!

ఈ ఘటన జరిగిన సమయంలో  అక్కడే ఉన్న పోలీసులు.. కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆప్ నేతలు అంటున్నారు.

కేజ్రీవాల్‎పై జరిగిన దాడి ఘటనపై ఢిల్లీ సీఎం ఆతిశీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ రాజకీయాలు ఎంత నీచానికి దిగజారిపోతాయో ఈ ఘటనతో ఢిల్లీ ప్రజలు చూశారని అన్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేమని బీజేపీకి తెలుసని.. అందుకే పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: టీడీపీ ఎమ్మెల్యేలకు పవర్‌ లేదు.. ఆ రెండు ఇంకా వైసీపీ చేతుల్లోనే..?

కేజ్రీవాల్‌ను చంపాలని...

కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి దాడులకు ఆప్ నేతలు భయపడబోరని స్పష్టం చేశారు.ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. ఈడీ, సీబీఐ, తీహార్ జైలుతో అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆప్‌ను అణిచివేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేపీ గూండాలు ఆయనపై దాడికి యత్నించారని ఆరోపించారు. కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే దానికి బీజేపీనే నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని సౌరభ్ భరద్వాజ్ అన్నారు.

 దాడి సమయంలో అక్కడే ఉన్న ఢిల్లీ పోలీసులు ఏం చేయకుండా బీజేపీ గుండాలతో కలిసి పోయారని ఆరోపించారు.ఇక ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. ట్విటర్‌లో ఒక వీడియోను కూడా పెట్టారు. బీజేపీకి.. అరవింద్ కేజ్రీవాల్ శత్రువుగా మారారని పేర్కొన్నారు. మొదట ఈడీ, సీబీఐని ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి.. కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారని విమర్శించారు.

తీహార్ జైలులో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వకుండా ఆపేసి.. ఆయను చంపేందుకు కుట్ర  చేశారని మండిపడ్డారు. అది ఫలించకపోవడంతో ఇప్పుడు బీజేపీ గూండాలు అరవింద్ కేజ్రీవాల్‌పై నేరుగా దాడి చేశారని.. కేజ్రీవాల్‌ను చంపేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌కి ఏం జరిగినా దానికి బీజేపీదే బాధ్యత అని చెప్పుకొచ్చారు.

Also Read:  శ్యామల తోపా..?..ఆమె కంటే మాకేం తక్కువ

Advertisment
Advertisment
తాజా కథనాలు