/rtv/media/media_files/2026/02/03/fotojet-7-2026-02-03-21-39-33.jpg)
'SFDR' test successful
SFDR: దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో విజయం సాధించింది. భారత్ అమ్ముల పొదిలో మరో క్షిపణి వచ్చి చేరింది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధికి కీలకమైన ‘సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్’ (SFDR) సాంకేతికతను డీఆర్డీవో(DRDO) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)లో ఈ ప్రయోగాన్ని నిర్వహించి విజయం సాధించింది.
ఈ పరీక్షల్లో భాగంగా నాజిల్ లెస్ బూస్టర్, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ మోటార్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి అన్ని వ్యవస్థలూ ఆశించిన రీతిలో అత్యుత్తమ పనితీరును కనబరిచినట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఐటీఆర్ ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ పరీక్ష విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించడం గమనార్హం.
‘ఎస్ఎఫ్డీఆర్’ ప్రొపల్షన్ వ్యవస్థ పరీక్ష విజయవంతంతో శత్రు దేశాల లక్ష్యాలను అత్యంత దూరం నుంచే అడ్డుకోగల క్షిపణుల తయారీ దిశగా భారత్ ముందడుగు వేసినట్లయ్యిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (HEMRL), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), ఐటీఆర్ శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు.
Follow Us